నాలుగేళ్ల పాలనలో అన్నిరంగాల్లో అభివృద్ధి

8 Jul, 2018 13:32 IST|Sakshi
మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాపూరావు

ఇచ్చోడ: నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో మండలాలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు అన్నారు. శనివారం ఇచ్చోడ మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. గ్రామాల్లో రోడ్లు, మురికికాల్వల నిర్మాణాలు, పాఠశాల భవనాలు, పంచాయతీ భవనాలు పూర్తిస్థాయిలో నిర్మాణాలు జరిగాయని ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్‌ హయాంలో అనేకగ్రామాలకు విద్యుత్‌ సరఫరా అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఇచ్చోడ మండలంలో కోకస్‌మాన్నూర్, ధర్మంపురి, నేరడిగొండ జి, సల్యాద, గుండాల గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మాణం అయినట్లు ఆయన తెలిపారు. మండలంలో నర్సపూ ర్‌లో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మించి సిరిచెల్మ, తలమద్రి, మాల్యల్, గెర్జం ఫీడర్ల కింద నలభై గ్రామాల కు విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపా రు.

రైతుబం«ధు పథకం ద్వారా భూమి ఉన్న ప్రతీ రైతుకు ఎకరానికి రూ.4 వేలు అందించిన ఘనత కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వనిదేనని తెలిపారు. నర్సపూర్, ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాడానికి సీసీరోడ్లు నిర్మిస్తామని తెలిపారు. ఇచ్చోడ మండలకేంద్రంలో శ్మాశాన వాటికి వద్ద కల్వర్టు నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. బీసీ హాస్టల్‌లో తాగు నీటికి బోరుకు నిధులు మంజూ రు చేస్తామని తెలిపారు. ఎల్లమగూడ, కేశవపట్నం గ్రామాల్లో నిర్మిస్తున్న డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మా ణాలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీల ద్వారా పిల్లలకు అందిస్తు న్న పౌష్టికాహారాన్ని పకడ్బందీగా అమలు చేయా లని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లకు ఆదేశించారు. వర్షా కాలంలో వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. ఎంపీపీ అమీనాబీ, ఇన్‌చార్జీ ఎంపీడీవో లింగయ్య, ఇచ్చోడ, సిరికొండ తహసీల్దార్లు మహేంద్రనాథ్, మోతీరాం, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు