'గుర్తుకొస్తున్నాయి'...ఎమ్మెల్యే

13 May, 2018 08:29 IST|Sakshi
 గోలీని కొడుతున్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌) : చిన్నప్పుడు ఆడిన గోలీల ఆటను ఒక్కసారి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ గుర్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని మోడ్రన్‌ రైతు బజార్‌ పనులను శనివారం పరిశీలించిన ఎమ్మెల్యే తిరిగి బయలుదేరారు. ఆ సమయంలో అక్క డే గోలీలు ఆడుకుంటున్న చిన్నారులను చూసిన ఆయన పరిశీలిస్తుండగా.. వారు మీరు కూడా ఆడతారా అంటూ అడిగారు. దీంతో ఎమ్మెల్యే వారి వద్ద నుంచి గోలీ తీసుకుని కాసేపు సరదాగా ఆడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ తన చిన్నతనంలో ఇలాంటి ఆటలకు ప్రాధాన్యత ఉండేదని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పటి తరం ఇండోర్‌ గేమ్స్, కంప్యూటర్లకే పరిమిత మవుతున్నారని తెలిపారు. అయితే, వేసవి సెలవుల సందర్భంగా పిల్లల విషయమై తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు.

మరిన్ని వార్తలు