ముగిసిన ఎమ్మెల్యే సతీమణి అంత్యక్రియలు

11 Jul, 2018 09:11 IST|Sakshi
మృతదేహం వద్ద నివాళ్లు అర్పిస్తున్న ఆయా పార్టీల నాయకులు  

వికారాబాద్‌ అర్బన్‌ : వికారాబాద్‌ ఎమ్మెల్యే సంజీవరావు సతీమణి తార (రెండోభార్య) అంత్యక్రియలు గంగారం సమీపంలోని శ్మశాన వాటికలో మంగళవారం పూర్తిచేశారు. అంతకుముందు ఎమ్మెల్యే నివాసం నుంచి నేరుగా మెథడిస్టు చర్చికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. అక్కడ క్రిష్టియన్‌ మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఈ కార్యక్రమంలో చేవెళ్లఎమ్మెల్యే కాలె యాదయ్య, విద్య మౌలిక వసతుల కల్పన చైర్మన్‌ నాగేందర్‌గౌడ్, టీఎస్‌పీఎస్సీ సభ్యుడు విఠల్, మాజీ మంత్రి డాక్టర్‌ ఏ.చంద్రశేఖర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మహేశ్‌రెడ్డి, ఆయా పార్టీల నాయకులు, అధికారులు, నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు