తొలి రోజు నామినేషన్లు నిల్

19 Feb, 2015 23:47 IST|Sakshi

    ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన కలెక్టర్
     ముగిసిన కొత్త ఓటరు దరఖాస్తుల స్వీకరణ
     మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 18,671 దరఖాస్తులు
     26 లోగా ఓటర్ల జాబితాతో ఫొటోలు అనుసంధానం

 
 నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగించేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణ రెడ్డి గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఆర్డీఓలు, మన జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద నోటిఫికేషన్ జారీ చేసి దానికి సంబంధించిన సమాచారాన్ని ఎన్నిక ల సంఘానికి పంపించారు. కాగా తొలి రోజు ఏ పార్టీ అభ్యర్థి నుంచి కూడా నామినేషన్లు దాఖలు కాలేదు. పట్టభద్రులు ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు కూడా గురువారంతో ముగిసింది. ప్రాథమిక సమాచారం మేరకు మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 18,671 దరఖాస్తులు వచ్చాయి.
 
 దీంట్లో నల్లగొండ-5,332, వరంగల్-8  వేలు, ఖమ్మం-5,339 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల ఆధారంగా శుక్రవారం నుం చి రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి విచారించనున్నారు. ఇదిలావుంటే ఫొటో ఓటర్ల జాబితా పూర్తి చేయడానికి తహసీల్దార్లు సహకంచాలని జాయింట్ కలెక్టర్ సత్యనారాయ ణ కోరారు. ఈ నెల 26 తేదీలోగా ఓటర్ల జాబితాతో ఫొటోల అనుసంధానం పూర్తిచేయాలని తహసీల్దార్లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీ చేశారు. ఓటరు జాబితాలో పేరు నమోదై స్థానికంగా లేకున్నా.. మరొక ప్రాంతానికి వలసవెళ్లినా లేదా చని పోయినట్లయితే అట్టి వివరాలను కూడా నమోదు చేస్తారు. కానీ ఓటరు జాబితా నుంచి పే ర్లు తొలగించరు. పోలింగ్  రోజున  ఆ ఓటరు సరియైన గుర్తింపు కార్డుతో పోలింగ్ కేంద్రానికి వెళ్లినట్లయితే ఓటు వేసేందుకు అనుమతిస్తారు.
 

మరిన్ని వార్తలు