సామాన్యుడిని గెలిపించండి

27 Feb, 2015 00:11 IST|Sakshi

 నల్లగొండ : పట్టభద్రుల ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అతి సామాన్యమైన వ్యక్తిని పోటీలో నిలబెట్టింది. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు కోట్లకు పడగలెత్తిన  వ్యక్తులను బరిలో దింపాయి. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తీన్మార్ మల్లన్న గెలుపునకు పార్టీలకతీతంగా సమష్టిగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు పిలుపునిచ్చారు. గురువారం కాంగ్రెస్ మ ండలి అభ్యర్థి తీన్మార్ మల్లన్న నామినేషన్ సందర్భంగా ఏచూరి గార్డెన్స్‌లో ఆ పార్టీ కార్యక ర్తల సమావేశం నిర్వహించింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు బూడిద బిక్షమయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏఐసీసీ సెక్రటరీ రామచంద్ర కుంతియా , రాష్ట్ర పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ...కేసీఆ ర్ పోరాటాల వల్ల తెలంగాణ రాలేదని, ప్రజల పోరాటాలకు చలించిన సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర ఆవిర్భావాన్ని కేసీఆర్ తన కుటుంబం గొప్ప తనంగా అభివర్ణించుకుంటున్నారని విమర్శించారు.
 
 తెలంగాణలో నల్లగొండ జిల్లాలో కాం గ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపించుకున్న ప్రాచుర్యం ఉందన్నారు. పార్టీలో విభేదాలు వీడి కాంగ్రెస్ గెలుపునకు అందరూ కృషి చేయాలన్నారు. పార్టీ సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొన్న వారికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పదవులు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ...ఎనిమిది నెలల కేసీఆర్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ... రాష్ట్రంలో పిట్టల దొర పాలనసాగు తోందన్నారు. విద్యా రంగాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారని విమర్శించారు. ఆంధ్రా పాలకులు జలదోపి డీ చేస్తున్నారని విమర్శించిన హారీష్ రావు.. చంద్రబాబుతో చేతులు కలిపి సాగర్ నుంచి నీటి ని విడుదల చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ సమష్టి కృషితో ఎమ్మెల్సీగా మల్లన్నను గెలిపించాలన్నారు.
 
 మోసపూరితమైన హామీలతో కేసీఆర్ అధికారం లోకి వచ్చారని ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ య్య మాట్లాడుతూ ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకుని కేసీఆర్ గత ఎన్నికల్లో..ఉప ఎన్నికల్లో గెలిచారని..అదే సెంటిమెంట్‌తో గద్దెనెక్కారని మాజీ కేంద్ర మంత్రి బలరాంనా యక్ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ దళితుడికి-ధనవంతుడికి మధ్య పోరాటం జరుగుతో ందన్నారు. సమావేశానికి ఖమ్మం, వరంగల్ జిల్లాల పార్టీ అధ్య క్షులు సత్యం, రాజేందర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, డీసీఎంస్ చైర్మన్ జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, తిప్పన విజయసింహారెడ్డి, యెడవల్లి విజేయేందర్ రెడ్డి, మా జీ ఎమ్మెల్సీ భారతీ రాగ్యా నాయక్, జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, పున్నా కైలాష్ నే త, మార్కెట్ కమిటీ చైర్మన్ పయిడి మర్రి సత్తిబాబు, మారుతి గురువులు, పాశం రామిరెడ్డి , గుమ్మల మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 నేను ఆస్తిపరుడిని కాదు : తీన్మార్ మల్లన్న
 ‘నేను ఆస్తిపరుడ్ని కాదు..వెనకాముందూ ఏమీ లేదు...ఈ ఎన్నికల్లో నేను గెలిచానా ఇప్పుడు ఏట్లా ఉన్నానో అప్పుడు అదేవిధంగా ఉంటాను’ అని తీన్మాన్ మల్లన్న చెప్పారు.
 

మరిన్ని వార్తలు