‘దిగ్విజయ్‌ను తెలంగాణలో తిరగనీయం’

2 May, 2017 19:53 IST|Sakshi
‘దిగ్విజయ్‌ను తెలంగాణలో తిరగనీయం’

- ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌, పార్టీ నేత బుడన్‌ బేగ్‌

సాక్షి, హైదరాబాద్‌ : తెంగాణా రాష్ట్ర ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్‌కు ముస్లిం మైనారిటీలను దూరం చేయాలని కాంగ్రెస్‌ నాయకులు పిల్లిమొగ్గలు వేస్తున్నారని ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌ విమర్శంచారు. దిగ్విజయ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యాతారాహిత్యమని, ఆయన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసులకు క్షమాపణ చెప్పకుంటే రాష్ట్రంలో తిరగనీయమని హెచ్చరించారు. పార్టీ సీనియర్‌ నాయకుడు బుడన్‌ బేగ్‌తో కలిసి మంగళవారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.

దిగ్విజయ్‌ వ్యాఖ్యలపై సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, షబ్బీర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దిగ్విజయ్‌పై చర్యలు తీసుకోవాలని ఫరూఖ్ ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్‌ నాయకత్వం తన పద్దతిని మార్చుకోవాలసి హితవు పలికారు. కర్ణాటక రాష్ట్రం నుంచి దిగ్విజయ్‌ సింగ్‌ను ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తొలగించిన మాదిరిగానే తెలంగాణ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి కూడా తొలగించాలని కాంగ్రెస్‌ హై కమాండ్‌కు సూచించారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్న  ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తున్నారని, తెలంగాణ పోలీసులు సమర్ధంగా పనిచేస్తుంటే ఓర్వలేక పోతున్నారని ఆయన పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు