ఆర్టీసీ నష్టాలకు కేసీఆరే కారణం..

7 Oct, 2019 14:19 IST|Sakshi

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

సాక్షి, జగిత్యాల: సీఎం కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీ కార్మికులను ఆందోళనకు గురిచేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాల్లో ఉందంటే కారణం కేసీఆర్‌ కాదా అని సూటిగా ప్రశ్నించారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరుపై నిప్పులు చెరిగారు. ‘తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే అగ్గితో పెట్టుకున్నట్లే’ అన్న కేసీఆర్‌..మరి ఇప్పుడు చేస్తుందేమిటని ధ్వజమెత్తారు.

ఏపీలో కొత్తగా ఎన్నికయిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి బాటలో నడుస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని..కానీ తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాత్రం ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని కుట్రల పన్నుతున్నారని దుయ్యబట్టారు. ‘ఆర్టీసీ సంగతి నువ్వు చూసేదేమిటీ..నీ సంగతి మేం చూస్తామంటూ ’ కేసీఆర్‌పై జీవన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రగతి భవన్‌లో బతుకమ్మ ఆడితే రాష్ట్ర్రం మొత్తం ఆడినట్లేనా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ నెల మొదటి రోజే జీతం తీసుకుని పండగ చేసుకుంటున్నారని.. ఆర్టీసీ కార్మికులు జీతాలు లేకుంటే పండగ ఎలా జరుపుకోవాలని నిలదీశారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు