వారిని ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచాలి: ఎమ్మెల్సీ

30 May, 2020 15:05 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: ఇదర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ ప్రభుత్వం తక్కువ కరోనా పరీక్షలు చేయడం చాలా ప్రమాదకరమని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ముంబై వలస కార్మికులు రాష్ట్రంలోకి రావడంతో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని సెల్ఫ్‌ క్వారంటైన్‌లో కాకుండా ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచి డాక్టర్ల పర్యవేక్షణలో పెట్టాలని చెప్పారు. క్వారంటైన్‌లో రెండు వారాలు కాకుండా 4 వారాల వరకు ఉంచాలని ఆయన సూచించారు.
(ఇంతవరకు రైతుబంధు ఊసే లేదు: జీవన్‌రెడ్డి)

గాంధీ హాస్పిటల్‌లో కరోనా పేషంట్లకు కనీసం రెండు సార్లు టెస్టులు చేయాలని, అలా కాకుండా 2 వారాలు అవగానే టెస్ట్‌ చేసి ఇంటికి పంపాలని పేర్కొన్నారు. నిరుపేదలకు ఇచ్చే రూ. 15 వందలు 6 నెలల వరకు ఇవ్వాలన్నారు. జన్‌దన్‌ మొదట 2 నెలలు ఇచ్చిందని.. కానీ ఇప్పుడు ఇవ్వటం లేదని తెలిపారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చిందని పేర్కొన్నారు. మద్యం అమ్మకాలు ఆశించిన మేరకు లేకపోవడంతో వేతనాలు చెల్లించలేకపోతుండటం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు