కేసీఆర్‌ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు

28 Apr, 2018 11:13 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

నకిరేకల్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని  ఎమెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక తుగ్లక్‌ లాగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడని అన్నారు. నకిరేకల్‌లోని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్వగృహంలో  శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు ఏ ఒక్కటి కూడా ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. ప్రజలపై అధికంగా భారం మోపుతూ రాజకీయ లబ్ధికోసం ఆరాటపడుతున్నారన్నారు. సాగు పెట్టుబడులకు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కూడా రైతులను మోసం చేసేందుకేనన్నారు. హైదరాబాద్‌ నగరం చుట్టూ భూస్వాములు, బడా కాంట్రాక్టర్‌లు బిల్డర్లు వేలాది భూములు కొనుగోలు చేశారన్నారు.

వారిని బాగు చేసేందుకు ఎకరాకు ఏడాదికి రెండు దఫాలు పెట్టుబడి సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు అందించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు.వచ్చేది రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీదే అధికారం అన్నారు. ప్రత్యేకించి 119 అసెంబ్లీ స్థానాల్లో నకిరేకల్‌ నుంచి రాబోయే 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‌పార్టీ నుంచి అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. తొలుత నకిరేకల్‌కు విచ్చేసిన రాజగోపాల్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఘనస్వాగతం పలికారు. సమావేశంలో స్థానిక సర్పంచ్‌  పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, కాంగ్రెస్‌మండల, పట్టణ అధ్యక్షుడు నకిరేకంటి ఏసుపాదం, నడికుడి వెంకటేశ్వర్లు, మంగళపల్లి సర్పంచ్‌ ప్రగడపు నవీన్‌రావు, ఎంపీటీసీ గుర్రం గణేష్, నాయకులు చెల్ల కృష్ణారెడ్డి, మాదధనలక్ష్మి, పల్లె విజయ్, రాచకొండ సునీల్, మామిడి కాయల నాగయ్య, ఆరుట్ల శ్రవణ్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు