ఎంఎంటీఎస్‌కు పదిహేనేళ్లు

9 Aug, 2018 07:38 IST|Sakshi

2003 ఆగస్టు 9న ప్రారంభమైన సర్వీసులు

నేడు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో వేడుకలు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సిటీ బస్సులే అందుబాటులో ఉన్న రోజుల్లో ఎంఎంటీఎస్‌ లోకల్‌ ట్రైన్‌ పట్టాలెక్కింది. ఈ వ్యవస్థ లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వరకు నగరం రెండు వైపులనుఅనుసంధానించేదిగా నిలిచింది. ప్రస్తుతం 121 సర్వీసులతో ప్రతిరోజు 1.6 లక్షల మంది రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న ఎంఎంటీఎస్‌2003 ఆగస్టు 9న తొలి రైలు పట్టాలెక్కినేటికి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 

రైలు పరుగులు ఇలా మొదలు..  
పెరుగుతున్న జనాభా, రోడ్లపై వాహనాల రద్దీ, ప్రయాణికుల అవసరాలు, అన్నింటికీ మించి వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎంఎంటీఎస్‌కు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో రూ.69.50 కోట్లతో ఈ లోకల్‌ రైళ్లు పట్టాలెక్కాయి. మొదట సికింద్రాబాద్‌ నుంచి లింగంపల్లి వరకు అందుబాటులోకి తెచ్చారు. అప్పటి ఉపప్రధాని ఎల్‌కే అద్వానీ ముఖ్య అతిథిగా హాజరై ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. అనతి కాలంలోనే సేవలు విస్తరించి సికింద్రాబాద్‌–ఫలక్‌నుమా మధ్య కూడా సర్వీసులను  ప్రారంభించారు. మొదట 25 వేల మంది ప్రయాణికులు, 30 సర్వీసులతో ప్రారంభమైన ఎంఎంటీఎస్‌ సేవలు.. ప్రయానికుల రద్దీకి అనుగుణంగా 2005 నాటికి సర్వీసుల సంఖ్య 48కి పెరిగాయి. ప్రస్తుతం 121 సర్వీసులు  తిరుగుతున్నాయి. సుమారు లక్షా 60 వేల మంది  ఎంఎంటీఎస్‌ను వినియోగించుకుంటున్నారు. రోజు రోజుకు ప్రయాణికుల రద్దీ పెరగడంతో 2009లో బోగీల సంఖ్యను 6 నుంచి 9కి పెంచారు. అటు హైటెక్‌ సిటీ నుంచి ఇటు  పాతనగరం వరకు అన్ని వర్గాల జీవితాల్లో ఎంఎంటీఎస్‌ ఒక భాగమైంది. ఈ క్రమంలోనే  2010లో మహిళల కోసం ‘మాతృభూమి’ని అందుబాటులోకి వచ్చారు. ప్రయాణికుల రద్దీ మేరకు రెండో దశ విస్తరణకు చర్యలు చేపట్టారు. ఇందులో సికింద్రాబాద్‌–బొల్లారం మధ్య త్వరలో రెండో దశ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. అటు ఘట్కేసర్‌ నుంచి ఇటు పటాన్‌చెరు, తెల్లాపూర్‌ వరకు, సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌ వరకు నగరం నలువైపులా శివారు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ 2013లో రెండోదశ నిర్మాణం చేపట్టారు. 

నేడు పుట్టిన రోజు వేడుక
నిత్యం ఎంఎంటీఎస్‌లో ప్రయానించే కొంతమంది ప్రయాణికులు కలిసి 10 ఏళ్ల క్రితం ‘ఎంఎంటీఎస్‌ ట్రావెలర్స్‌ అసోసియేషన్‌’ను ఏర్పాటు చేశారు. ఈ సంఘం ఏటా ఆగస్టు  9న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ‘ఎంఎంటీఎస్‌ పుట్టిన రోజు’ వేడుకలు నిర్వహిస్తుంది. రైల్వే ఉన్నతాధికారులు, ప్రయాణికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం 15 ఏళ్లు నిండిన  సందర్భంగా గురువారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేçషÙన్‌ 10వ నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్టు సంఘం ప్రతినిధులు చంద్ర, రవి తదితరులు తెలిపారు. అలాగే  హైటెక్‌సిటీ స్టేషన్‌లో మొక్కలు నాటనున్నారు. సికింద్రాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.

మా సేవలు ఎలా ఉన్నాయి..
నగరంలో ఎంఎంటీఎస్‌ రైళ్లు ప్రారంభించిన 15 ఏళ్లు నిండిన సందర్భంగా దక్షిణమధ్య రైల్వే ప్రయాణికుల అభిప్రాయాల సేకరిస్తోంది. వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్‌ రైళ్ల నిర్వహణపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు ఆశిస్తోంది. ఎలాంటి సర్వీసులను కోరుకుంటున్నారు. ఏ విధమైన చర్యలు తీసుకోవాలి. స్టేషన్లలో ఉన్న సమస్యలు వంటిపై ఆరా తీస్తోంది. ప్రయాణికులు తమ సలహాలు, సూచనలను   uఠిఝఝ్టటఃజఝ్చజీ .ఛిౌఝకు మెయిల్‌ ద్వారా తెలియజేవచ్చు. ఈ మేరకు 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక లోగోను విడుదల చేశారు. 

మరిన్ని వార్తలు