పట్టాలు తప్పిన ఎంఎంటీఎస్‌ ట్రైన్‌

20 Mar, 2020 09:10 IST|Sakshi

డ్రైవర్‌ అప్రమత్తతోతప్పిన పెను ప్రమాదం

ఆలస్యంగా నడిచిన ప్యాసింజర్, ఎక్స్‌ప్రైస్‌ రైళ్ళు

హఫీజ్‌పేట్‌ : లింగంపల్లి నుంచి హైదరాబాద్‌ వెళుతున్న ఎంఎంటీఎస్‌ లోకల్‌ రైలు పట్టాలు తప్పింది. లింగంపల్లి నుంచి హైదరాబాద్‌ వెళ్ళే రైలు (47141) సాయంత్రం 5.20 గంటలకు లింగంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరింది. 5 నిమిషాల అనంతరం చందానగర్‌ రైల్వే స్టేషన్‌ దాటిన అనంతరం హఫీజ్‌పేట్‌ స్టేషన్‌ వద్ద రైలు చివరి బోగి చక్రం రాడ్‌ విరిగింది. దీంతో పెద్ద శబ్దంతో ఒక్కసారి పట్టాలు తప్పి బోగి పక్కకు ఒరిగింది.  డ్రైవర్‌ అప్రమత్తతో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా రైలును నిలిపిపివేశారు.  

ఆలస్యంగా ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్‌ రైలు...
ఎంఎంటీఎస్‌ రైలు పట్టాలు తప్పడంతో లింగంపల్లి నుంచి హైదరాబాద్, ఫలక్‌నూమాకు వెళ్ళే లోకల్‌ రైళ్ళను రద్దు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి, షిర్డి, గుల్బర్గా, కాకినాడలకు వెళ్ళే పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. తాండురు, గుల్బర్గా నుంచి నగరానికి రావల్సిన ప్యాసింజర్‌ రైళ్ళు  రెండు గంటల తరువాత నడిచాయి. లింగంపల్లికి రావాల్సిన అన్ని లోకల్‌ రైళ్ళు హఫీజ్‌పేట్‌ రైల్వే స్టేషన్‌ నుంచి  తిప్పి పంపారు.

మరిన్ని వార్తలు