మొబైల్ హెల్త్ వాహనాలు ప్రారంభం

13 Jul, 2016 01:42 IST|Sakshi

 నల్లగొండ టౌన్: గ్రామీణ స్థాయిలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించడానికి జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్‌బీఎస్‌కే పథకం కోసం సమకూర్చిన మొబైల్ వాహనాలను మంగళవారం కలెక్టర్ పి.సత్యనారాయణరె డ్డి తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడంలో నిర్లక్ష్యం తగదన్నారు.
 
 చిన్నారుల ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ద తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా వై ద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ భానుప్రసాద్‌నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని 15 క్లస్టర్‌లకు గాను ఒక్కో క్లస్టర్‌కు రెండు వాహనాల చొప్పున 30 వాహనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కో మొబైల్ వాహనంలో ఇద్దరు డాక్టర్లు ఫార్మసిస్ట్, ఏఎన్‌ఎం టీంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణాధికారి  డాక్టర్  అరుంధతి, డాక్టర్ లలితాదేవి, జిల్లా మలేరియా అధికారి ఓంప్రకాష్, జిల్లా మాస్‌మీడియా అధికారి జి.తిరుతపయ్య, నర్సింహ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు