రానున్న మూడ్రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

16 Sep, 2018 01:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాల్లో ఈ నెల 18న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.
 
వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం:  సరూర్‌నగర్‌(రంగారెడ్డి) 3 సెం.మీ., వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని నల్లబెల్లి, ధర్మసాగర్, భీమదేవరపల్లిలో 1 సెం.మీ వర్షపాతం నమోదైంది.

మరిన్ని వార్తలు