అభివృద్ధి పేరుతో దేశాన్ని మోసగిస్తున్న మోదీ

4 Sep, 2018 15:12 IST|Sakshi
  మాట్లాడుతున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు నాజీర్‌ హుస్సేన్‌ 

రాఫెల్‌ యుద్ద విమానం కొనుగోలులో భారీ అక్రమాలు

ఏఐసీసీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు నాజీర్‌ హుస్సేన్‌

నిజామాబాద్‌ సిటీ(నిజామాబాద్‌ అర్బన్‌) : పెట్టుబడి దారి వ్యవస్థను ప్రొత్సహిస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ రక్షణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అభివృద్ధి పేరిటా దేశాన్ని మోసగిస్తున్నారని, రాఫెల్‌ యుద్ద విమానాల కొనుగోలులో భారీ అక్రమాలే ఇందుకు నిదర్శనమని ఏఐసీసీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు నాజీర్‌ హుస్సెన్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పాల్పడున్న అక్రమాలను కాంగ్రెస్‌ పార్టీ బయటపెట్టి ప్రశ్నిస్తున్న వీటికి సమాదానం చెప్పటంలేదని ఆయన విమర్శించారు.

బీజేపీ ప్రభుత్వ అక్రమాలపై దేశ ప్రజలకు విడమరచి చెప్పెందుకు ఏఐసీసీ ప్రజల్లోకి వచ్చిందని, ఇందులో భాగంగానే రాష్ట్ర పర్యటనలో భాగంగా తాను జిల్లాకు రావటం జరిగిందన్నారు. 2015లో పారిస్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని అకస్మాత్తుగా 36 యుద్ద విమానాలను ఒక్కో విమానాన్ని రూ. 1670.70 కోట్లతో కొనుగోలు చేయగా, 36 విమానాల ధర ఏకంగా రూ. 60,145 కోట్లకు చేరిందన్నారు. దాంతో డస్సాల్గ్‌ ఏవియేషన్‌ తన వార్షిక నివేదిక, రిలయన్స్‌ డిఫెన్స్‌ రిపోర్ట్‌ ప్రకారం కొత్త ధరలో తేడా స్పష్టంగా తెలిసిందన్నారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ నిలదీయగా, విమానాల కొనుగోలులో ఎటువంటి దాపరికాలు లేవని కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిందన్నారు.

యుద్ద విమానాల తయారీ కంపనీ డస్సాల్గ్, రిలయన్స్‌ మధ్యగల అంతర్గత ఒప్పంద రహస్యమేమిటో చెప్పాలని కాంగ్రెస్‌ ప్రశ్నిస్తే బీజేపీ ప్రభుత్వం ఎందుకని తిరస్కరించిందో చెప్పాలన్నారు. ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫోరెన్స్‌ పార్టీ చెప్పిన విషయాల ఆధారంగా మన దేశ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రాధమిక ఒప్పందం విషయంలో అబద్దాలు చెప్పినట్లు రుజువయ్యిందన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు తాహెర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కేశ వేణు, నాయకులు అరికెలా నర్సారెడ్డి, శేఖర్‌గౌడ్, రాంభూపాల్, మాజీద్‌ఖాన్, అంతిరెడ్డి రాజిరెడ్డి, అగ్గు భోజన్న, జావీద్‌ అక్రమ్, విపుల్‌గౌడ్, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు