రక్తంతో సీఎం కేసీఆర్‌కు లేఖ

17 Jul, 2017 07:53 IST|Sakshi
రక్తంతో సీఎం కేసీఆర్‌కు లేఖ

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖను జీఎస్టీకి అనుగుణంగా పునర్‌ వ్యవస్థీకరించాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మహ్మద్‌ ముజాహిద్‌ హుస్సేన్‌ రక్తంతో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఆదివారం హైదరాబాద్‌లో లేఖ పత్రులను పత్రికలకు ఆయన విడుదల చేశారు.

కేంద్ర ప్రభుత్వం జూలై ఒకటిన ఒకే దేశం ఒకే పన్ను (జీఎస్టీ) ఒకే మార్కెట్‌ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తూనే దానికి అనుగుణంగా రాష్ట్ర పన్నుల శాఖ కూడా రీ–ఆర్గనైజేషన్‌ కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పునర్‌ వ్యవస్థీకరణతోనే రాష్ట్ర పన్నుల శాఖ బలోపేతం అవుతుందన్నారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టే విధంగా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు