జాతి భేదాన్ని మరిచి..

15 Mar, 2020 08:57 IST|Sakshi

సాక్షి, నాగార్జునసాగర్‌ : జాతి భేదాన్ని మరిచి గేదెలతో కోతి సహవాసం చేస్తూ జీవనం సాగిస్తుంది. మండలంలోని పోతునూరు గ్రామానికి చెందిన యాసాల వెంకటేశ్వర్‌రావు ఇంట్లోకి రెండు నెలల క్రితం కోతి పిల్ల వచ్చింది. అది ఇంటి పరిసరాలలోనే ఉంటూ గేదెలతో సహవాసం చేస్తూ వాటితో మమేకమైపోయింది. ఇలా పది రోజుల తర్వాత యజమాని వెంకటేశ్వర్‌రావు పశుగ్రాసం కోసం గేదెలను మేపడానికి వ్యవసాయ పొలాలకు తోలుకుపోతున్నా కోతి గేదెపై ఎక్కి వాటి వెంటే వచ్చింది. అప్పటి నుంచి రాత్రి సమయంలో ఇంటి ఆవరణలోని వేపచెట్టుపై నిద్రించటం, ఉదయం గేదెల వెంట పొలాలకు వెళ్లడం పరిపాటిగా మారింది. కోతిని గేదెలు కూడా ఏమీ అనడం లేదు. వెంకటేశ్వర్‌రావు కుటుంబ సభ్యులు కూడా కోతికి తినుబండారాలు ఇచ్చి ఆదరిస్తున్నారు.    

మరిన్ని వార్తలు