ఉధృతమైన రుతుపవనాలు

15 Jun, 2015 03:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ఉధృతంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు కూడా ఇలాగే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ డెరైక్టర్ వైకే రెడ్డి చెప్పారు. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని ఆయన పేర్కొన్నారు.

కాగా, ఆదివారం అధికంగా ఖమ్మం జిల్లా మణుగూరులో 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇల్లెందులో 7 సెం.మీ, గూడూరు, బయ్యారం, దుమ్ముగూడెం పలుచోట్ల 6 సెంటీమీటర్ల చొప్పున వర్షం నమోదైంది. వరంగల్ జిల్లా పాలకుర్తి, మహబూబాబాద్, నర్సంపేట తదితర ప్రాంతాల్లో 5 సెంటీ మీటర్ల చొప్పున వర్షం కురిసింది.

>
మరిన్ని వార్తలు