వృత్తివిద్యకు పెద్దపీట!

21 Mar, 2015 02:19 IST|Sakshi

నేడు ఢిల్లీలో విద్యాశాఖ మంత్రుల సమావేశం
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయిలో కేంద్రం రూపొందిస్తున్న నూతన విద్యావిధానంలో వృత్తివిద్యకు పెద్దపీట వేయబోతోంది. ఇందులో భాగంగా ఈ నెల 21న ఢిల్లీలో అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో సమావేశాన్ని నిర్విహ స్తోంది. ఈ సమావేశానికి   ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్.ఆర్.ఆచార్య హాజరుకానున్నారు. రాష్ట్రంలోనూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాల స్థాయిలో వృత్తివిద్యను అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఇప్పటికే కేంద్రం రూపొందించిన నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్(ఎన్‌ఎస్‌క్యూఎఫ్) ప్రకారం 9వ తరగతి నుంచే వృత్తి విద్యను ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ అంశంతోపాటు ఎలిమెంటరీ విద్యలో నైపుణ్యాల పెంపు, పాఠశాల పరీక్ష విధానాల్లో సంస్కరణలు, ఉపాధ్యాయ విద్య పునర్‌వ్యవస్థీకరణ, పిల్లల ఆరోగ్యం తదితర అంశాలపై చర్చించి నిర్ణయం సమావేశం తీసుకోనుంది.

>
మరిన్ని వార్తలు