కుటుంబాలు తక్కువ.. కార్డులు ఎక్కువ..!

7 Aug, 2019 11:20 IST|Sakshi

అనర్హులకూ ఆహార భద్రత కార్డులు

ఆరోగ్యశ్రీ, ఆసరా లాంటి పథకాల కోసమే..

గుడ్డిగా కార్డులు జారీ చేస్తున్న అధికారులు

సాక్షి, ఇందూరు (నిజామాబాద్‌): పేదలకు దక్కాల్సిన పథకాలు పెద్దల పాలవుతున్నాయి. దారిద్య్ర రేఖకు దిగువన గల కుటుంబాలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు అనర్హులకు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తుండడంతో పేదల కార్డులపై పెద్దల కన్ను పడింది. తెల్ల రేషన్‌ కార్డుంటే లక్షలు ఖర్చయ్యే వైద్యాన్ని ఉచితంగా పొందవచ్చనే ఉద్దేశంతో బహుళ అంతస్తుల భవనాలు, ఇంటి ముందు కార్లు ఉన్న చాలా మంది శ్రీమంతులు కూడా అక్రమంగా ఆహార భద్రతా కార్డులు పొందుతున్నారు. ఇందుకు జిల్లాలో కుటుంబాల సంఖ్య కంటే రేషన్‌ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ లెక్కలను చూస్తే జిల్లాలో వేలాది కార్డులు అనర్హుల చేతుల్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

జిల్లాలో కుటుంబాలు - 3,69,031
ఆహార భద్రత కార్డులు - 3,91,749

భద్రత కోసమే..
జిల్లాల పునర్విభజన తరువాత నిజామాబాద్‌ జిల్లా మొత్తం జనాభా 15,71,022 ఉండగా, 3,69,031 కుటుంబాలు ఉన్నాయి. కానీ జిల్లాలోని 27 మండలాల పరిధిలో 3,91,749 రేషన్‌ కార్డులున్నాయి. ఈ లెక్కన కుటుంబాల కంటే రేషన్‌ కార్డులు 22,718 అధికంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వీరిలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు, బడా కాంట్రాక్టర్లు, ఉన్నత వర్గాల వారున్నారు. వీరు నెలనెలా రేషన్‌ దుకాణాలకు వెళ్లి రాయితీపై బియ్యం తీసుకుని బయట ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. రూపాయికి కిలో బియ్యం రేషన్‌ దుకాణాల ద్వారా పొంది, మార్కెట్‌లో రూ. 10 నుంచి రూ.15 వరకు కిలోకు విక్రయిస్తున్నారు.

తెలిసి కూడా కార్డులు జారీ.. 
మండల స్థాయిలో మీ సేవ కేంద్రాల ద్వా రా తహసీల్దార్‌ కార్యాలయానికి రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నా రు. అయితే, ఆహార భద్రతా కార్డులతో కలిగే లాభాలను చూసి శ్రీమంతులు కూడా కార్డుల కోసం ఉవ్విళ్లూరుతున్నా రు. దరఖాస్తులు చేసుకున్న వారు శ్రీమంతులు అని తెలిసీ కూడా మండలాధికారు లు కార్డులు మంజూరు చేస్తున్నారు. కం ప్యూటర్‌ ఆపరేటర్లు, రేషన్‌ డీలర్లు కూడా అందిన కాడికి దండుకుంటున్నారు. వాస్తవానికి ఉత్తర్వు నెం.17 ప్రకారం లబ్ధిదారులకు ఇచ్చే ఆహార భద్రతా కార్డులు కేవలం రేషన్‌ కార్డులు తీసుకోవడానికి వినియోగించాలి. కానీ పలు సంక్షేమ పథకాలకు కూడా ఈ కార్డులను కచ్చితం చేసింది ప్రభుత్వం. ఆసరా పింఛన్లు, ఆరోగ్యశ్రీ, కుల, ఆదాయ, ఇతర సర్టిఫికెట్లు పొందటానికి రేషన్‌కార్డు తప్పనిసరిగా మారింది.

పెరుగుతోన్న కార్డుల సంఖ్య.. 
జిల్లాలో కొత్తగా ఆహార భద్రతా కార్డుల కోసం దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. జూలై 31 నాటికి జిల్లాలో 3,91,749 కార్డు లుండగా, ఇంకా 20 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే 36,616 దరఖాస్తులు అనర్హతగా గుర్తించి రిజెక్టు చేశారు. ప్రస్తుతం రేషన్‌ కార్డుల మంజూరు నిలిచిపోయి 45 రోజులవుతోంది. రాష్ట్ర స్థాయి నుంచే రేషన్‌ కార్డుల మం జూరుకి ప్రభుత్వం బ్రేక్‌ వేసింది. కుటుం బాల సంఖ్య కంటే ఎక్కువ మొత్తంలో రేషన్‌ కార్డులుండడంతోనే కొత్త కార్డుల మంజూరు నిలిపివేసినట్లు తెలుస్తోంది. అనర్హుల కార్డులు తొలగించే వరకు కొత్తవి ఇవ్వకపోవచ్చని సమాచారం. 

మరిన్ని వార్తలు