వడదెబ్బతో ఆరుగురి మృతి

5 Jun, 2015 23:58 IST|Sakshi
వడదెబ్బతో ఆరుగురి మృతి

అర్వపల్లి : వడదెబ్బతో ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఘటనల వివరాలు.. మండలంలోని కోడూరు గ్రామానికి చెందిన దేశగాని మల్లయ్య(75) ఎండతీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. ఇంటి వద్దనే చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతిడికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.  

 వేణుగోపాలపురం(నడిగూడెం): మండలంలోని వేణుగోపాలపురానికి  చెందిన సంపతి పెద వెంకన్న(45) వారం రోజుల కిందట వడదెబ్బకు గురయ్యాడు.ఇంటివద్దనే చికిత్స పొందుతూ శుక్రవా రం మృతిచెందాడు.  

 కోదాడఅర్బన్:  మండల పరిధిలోని గుడిబండ గ్రామానికి చెందిన ఎస్‌కె.ఖాసీంసాబ్(70) ఎండవేడిమికి అస్వస్థతకు గురయ్యాడు. రెండు రోజు లుగా ఇంటి వద్దనే చికిత్స పొందుతున్న ఆయన గురువారం రాత్రి మరణి ంచినట్లు  కుటుంబ సభ్యులు తెలిపారు.  శుక్రవారం ఆయన కుటుం బాన్ని టీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు వాచేపల్లి వెంకటేశ్వరరెడ్డి పరామర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.

 మిర్యాలగూడ : మండలంలోని దొండవారిగూడెం గ్రామ పంచాయతీ పరిధి పచ్చారిగడ్డ గ్రామానికి చెందిన చిరుమళ్ల వెంకయ్య(70) ఎండ వేడిమికి అస్వస్థతకు గురయ్యాడు. ఇంటి వద్దనే చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్టు మృతుడి బంధువులు పేర్కొన్నారు.
 గరిడేపల్లి: మండల కేంద్రానికి చెందిన పెండెం భిక్షం (55) గీతకార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఎండలో తాళ్లు ఎక్కడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

 చిలుకూరు : మండలంలోని చెన్నారిగూడెం గ్రామానికి చెందిన కమతం రామయ్య (68) ఎండలకు అస్వస్థతకు గురయ్యాడు. స్థానికంగా చిక్సిత పొందుతూ శుక్రవారం మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు