అంధకారంలో వందకుపైగా గ్రామాలు

6 Jun, 2016 00:42 IST|Sakshi
అంధకారంలో వందకుపైగా గ్రామాలు

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి ప్రారంభమైన గాలుల ధాటికి భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆదిలాబాద్‌లో కలెక్టరేట్ ప్రధాన ద్వారం, జిల్లా అగ్నిమాపక కార్యాలయం వద్ద భారీ వృక్షాలు నేలకొరి గారుు. పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాలకు విద్యుత్ సరఫరా చేసే లైన్ తెగిపోరుుంది. దీంతో జైనథ్ మండలంలో సుమారు 55 గ్రామాలు, బేల మండలంలో 65 గ్రామాలు, ఆదిలాబాద్ మండలంలో 70కిపైగా గ్రామా ల్లో అంధకారం నెలకొంది. తాంసి, తలమడుగు మండలాల్లో కూడా కొంత నష్టం వాటిల్లింది. విద్యుత్ సిబ్బంది, అధికారులు ఆదివారం ఉదయం నుంచే పునరుద్ధరణ పనులు చేపట్టారు. జిల్లాలోని నార్నూర్ మండలంలో శనివారం కురిసిన భారీ వర్షం, బలమైన గాలులకు 17 ఎకరాల్లో అరటితోటకు నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన  50 లక్షల రూపాయల విలువైన పంట నేలకొరిగింది.

 మెదక్ జిల్లాలో మహిళ దుర్మరణం
 జహీరాబాద్: మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారంరాత్రి ఈదురు గాలులు బీభత్సాన్ని సృష్టించాయి. మన్నాపూర్‌లో ఓ ఇంటిపై ఉన్న కర్ర తలపై పడడంతో అమీనాబీ(35) అనే గృహిణి మరణించింది. ఏసప్ప, సిద్ధప్ప ఇళ్లపై భారీ మర్రి వృక్షం కూలడంతో వారి ఇళ్లు దెబ్బతిన్నాయి. నిద్రలో నుంచి తేరుకున్నవారు వెంటనే అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు.

మరిన్ని వార్తలు