ట్యాబ్‌లెట్‌లో దోమ

24 Oct, 2019 03:07 IST|Sakshi

సంగారెడ్డి రూరల్‌ : గ్రామ ఆరోగ్య వేదికలో వైద్య సిబ్బంది అందజేసిన ప్యారసెటమాల్‌ ట్యాబ్‌లెట్‌లో దోమ రావడంతో అధికారులు కంగుతిన్నారు. బుధవారం సంగారెడ్డి రూరల్‌ మండల కేంద్రమైన కందిలో గ్రామ ఆరోగ్య వేదిక నిర్వహించారు. లక్ష్మీనగర్‌కు చెందిన సీహెచ్‌ రాము అనే యువకుడికి జ్వరంతో పాటు ఒళ్లునొప్పులు ఉండటంతో ఆరోగ్య వేదికకు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నాడు.

అనంతరం ఇంటికి వెళ్లిన రాము, సిబ్బంది ఇచ్చిన ట్యాబ్‌లెట్‌లను వేసుకుంటుండగా ప్యారసెటమాల్‌ ట్యాబ్‌లెట్‌ ప్యాకింగ్‌లో మృతి చెందిన దోమ ఉండటంతో అవాక్కయ్యాడు. వెంటనే ఆరోగ్య వేదికకు వచ్చి ట్యాబ్‌లెట్‌ను సిబ్బందికి చూపించడంతో వారు ట్యాబ్‌లెట్‌లను వెనక్కి తీసుకొని పైఅధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 

మరిన్ని వార్తలు