అత్యంత రద్దీగల మెట్రోస్టేషన్‌ ఎల్‌బీ నగర్‌! 

23 Oct, 2018 20:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎల్‌బీ నగర్‌-మియాపుర్‌ మార్గంలో అత్యంత రద్దీ సమయంలో ప్రతి 3.15నిమిషాలకు ఒక మెట్రోరైలును నడుపుతున్నామని, ఎల్‌బీ నగర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి ప్రతినిత్యం అత్యధికంగా ప్రయాణిస్తున్నారని హైదరాబాద్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌ ఎండీ ఎన్వీయస్‌ రెడ్డి తెలిపారు. మెట్రో భవన్‌, హెచ్‌ఎమ్‌ఆర్‌ఎల్‌, ఎల్‌ అండ్‌ టి మెట్రో రైలు హైదరాబాద్‌ లిమిటెడ్‌ ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎన్వీయస్‌ రెడ్డి మాట్లాడుతూ.. మెట్రో కారిడార్‌ 1లోని ఎల్‌బీ నగర్‌-మియాపూర్‌ల నడుమ ప్రతిరోజు 21రైళ్లు, కారిడార్‌3లోని నాగోల్‌-అమీర్‌పేట్‌ల నడుమ 12రైళ్లు, మొత్తంగా 33 రైళ్లు నడుపుతున్నామని తెలిపారు. సాధారణ రద్దీ సమయంలో ప్రతి ఆరున్నర నిముషాలకొకసారి నడుపుతున్నట్లు,ఇతర సాధారణ సమయాల్లో ప్రతి ఎనిమిది నిమిషాలకొక మెట్రో రైలును నడుపుత్నుట్లు పేర్కొన్నారు. కారిడార్‌ 1లో 284 ట్రిప్పులు, కారిడార్‌ 3లో 266 ట్రిప్పులు మొత్తంగా 550 ట్రిప్పులతో ప్రయాణీకులను గమ్యస్థానానికి చేరుస్తున్నామని అన్నారు. కారిడార్‌ 1లో సగటున 1.25లక్షలు, కారిడార్‌ 3లో యాభై వేల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. మెట్రో సర్వీసులను ప్రజలు మరింత విరివిగా వినియోగించుకోవాలని కోరారు. 

మరిన్ని వార్తలు