అమ్మ వద్దంది.. బస్తీ ఆదుకుంది

17 Oct, 2019 11:49 IST|Sakshi
చిన్నారితో అంగన్‌వాడీ టీచర్‌ కేజీయమ్మ

సాక్షి, రంగారెడ్డి: రెండు నెలలు కూడా నిండని చిన్నారిని తల్లి రోడ్డుపై వదిలేసి అదృశ్యమైంది. ఈ ఘటన ఫిలింనగర్‌లో చోటుచేసుకుంది. ఫిలింనగర్‌లోని బీజేఆర్‌నగర్‌ బస్తీలో నివసించే రాంబాబు అనే వ్యక్తి ఇంట్లో రెండు నెలల క్రితం ఓ మహిళ అద్దెకు దిగింది. నెలన్నర క్రితం ఆమె ఓ బాబుకు జన్మనిచ్చింది. భర్త, కుటుంబసభ్యు లు ఎవరూ లేకుండానే ఒంటరిగా జీవిస్తోంది. అయితే బాబును పెంచడం ఆమెకు భారమైంది. దీనికి తోడు వ్యాధులు చుట్టుముట్టాయి. అటు కన్న కొడుకును పోషించలేక, ఇటు తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోలేక మంగళవారం రాత్రి చిన్నారిని కొత్త చెరువు రోడ్డు పక్కన ఉండే ఓ మహిళ దగ్గర వదిలేసి వెళ్లిపోయింది.

రాత్రి 10గంటలు దాటినా ఆ చిన్నారిని తీసుకెళ్లడానికి రాలేదు. గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారిని స్థానికులు గమనించినప్పటికీ... రోడ్డు పక్కన స్పృహ లేకుండా పడి ఉన్న మహిళ కొడుకేమో నని భావించారు. తీరా ఆమెను మేల్కొలిపి అడిగితే... ఆ బిడ్డకు తనకు సంబంధం లేదని చెప్పింది. దీంతో స్థానికులు బాబును బీజేఆర్‌నగర్‌ అంగన్‌వాడీ టీచర్‌ కేజీయమ్మకు అప్పగించారు. ఆమె ఆ చిన్నారి తల్లి కోసం అన్ని ప్రాంతాలు గాలించినా ఉపయోగం లేకుండా పో యింది. ఇంటి యజమాని రాంబాబును ప్రశ్నించగా ఓ మహిళ కొంతకాలం క్రితం అద్దెకు దిగిందని వివరాలు కూడా సరిగ్గా తెలియవని చెప్పా రు.

స్థానికంగా ఓ మహిళతో బాబుకు పాలు పట్టించి చుట్టుపక్కల బస్తీల్లో ఆరా తీసింది. అయి తే ఈ చిన్నారి తల్లి సోదరుడు పక్క బస్తీలో ఉం టాడని తెలుసుకోగా... అప్పటికే సోదరుడితో పాటు తన భార్య ఘటనా స్థలానికి చేరుకొని ఆ చిన్నారి తమ సోదరి కొడుకని,  కొంతకాలంగా ఒంటరిగా ఉంటోందని తాము తీసుకెళ్తామని చె ప్పారు. పెద్దల సమక్షంలో ఆ చిన్నారిని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు కేజీయమ్మ తెలి పారు. తల్లి రోడ్డున పడేస్తే చుట్టుపక్కల వారు ఆదుకొని మానవత చూపారు.    

మరిన్ని వార్తలు