ఆర్థిక ఇబ‍్బందులతో తల్లీకొడుకు ఆత‍్మహత‍్య

18 Dec, 2017 10:52 IST|Sakshi

సాక్షి, నల్గొండ: నల్గొండ జిల్లా మునుగోడు మండలం వెల్మకన్నెలో సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి తల్లీకొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను మారెమ్మ(58), యాదయ్య(38)గా గుర్తించారు. గత కొంత కాలంగా వీరు ఆర్థిక ఇబ‍్బందులతో బాధపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. దాంతో జీవితంపై విరక్తి చెంది ఆత‍్మహత‍్య చేసుకున‍్నట్లు చెబుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించడంతో వెల్మకన్నెలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు