బీజేపీలోకి మోత్కుపల్లి

7 Jan, 2020 10:19 IST|Sakshi

 నేడు జేపీ నడ్డా  సమక్షంలో చేరిక

రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి ఢిల్లీకి  వెళ్లిన నరసింహులు

సాక్షి, యాదాద్రి : సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు కాషాయ కండువా కప్పుకోనున్నారు. సోమవారం రాత్రి ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు. టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని ఎన్‌టీఆర్‌ ఘాట్‌ వద్ద సంచలన ప్రకటనను చేసి టీడీపీ నుంచి బహిష్కృదుడయ్యాడు. అనంతరం 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొంతకాలం క్రితమే బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల వా యిదా పడుతూ వస్తోంది. మంగళవారం ఢిల్లీలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీనడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. 

రాజకీయ జీవితంలో చేపట్టిన పదవులు
ఎన్‌టీఆర్‌ మంత్రి వర్గంలో గనులు, విద్యుత్, సాంఘిక సంక్షేమం, టూరిజం శాఖ మంత్రిగా పని చేశారు. 1982లో ఎన్‌టీఆర్‌ నూతనంగా స్థాపించిన తెలుగుదేశం పార్టీలో విద్యార్థి దశలోనే చేరారు. 1983లో జరిగిన ఎన్నికల్లో ఆయన తొలిసారిగా ఆలేరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1985లో టీడీపీ నుంచి, 1989లో ఇండిపెండెంట్‌గా, 1994 టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందా రు. 1999లో కాంగ్రెస్‌నుంచి  ఆలేరులో గెలు పొందిన ఆయన 2004 టీడీపీ తరఫున ఆలేరులోనే ఓటమిపాలయ్యారు. 2008లో జరిగి న ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయా డు. 2009లో తుంగతుర్తి నియోజకవర్గంలో టీడీ పీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2014 లో ఖమ్మం జిల్లా మధిరలో పోటీ చేసి ఓటమి చెందాడు. 2018లో బీఎల్‌ఎఫ్‌ తరఫున ఆలే రు నుంచి పోటీ చేసి మరోసారి పరాజయంపాలయ్యాడు. 1991లో నంద్యాల లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావుపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.  టీడీపీ నుంచి బహిష్కరణ అ నంతరం ప్రజావేదిక ఏర్పాటు చేసి 2018 ముందస్తు ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ మద్దతుతో ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగారు.

మరిన్ని వార్తలు