'కేసీఆర్ ముఖ్యమంత్రా లేక రౌడీనా?'

18 Nov, 2014 15:21 IST|Sakshi
'కేసీఆర్ ముఖ్యమంత్రా లేక రౌడీనా?'

హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై టీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రా లేక రౌడీనా అంటూ ధ్వజమెత్తారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎందుకు కొంటున్నారని ప్రశ్నించారు.

రాజీనామా చేయకుండా పార్టీలు మారే వారికి టీఆర్ఎస్ కండువాలు ఎలా కప్పుతారని నిలదీశారు. దమ్ముంటే టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిచిపించుకోవాలని కేసీఆర్ కుమోత్కుపల్లి సవాల్ విసిరారు.

మరిన్ని వార్తలు