చలానా.. కోట్లు..సాలీనా!

12 Sep, 2019 04:18 IST|Sakshi

మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్‌ లేకుండా డ్రైవింగ్, ఓవర్‌స్పీడ్‌ డ్రైవింగ్‌... ఏదైతేనేమి ఏటా వాహనదారులు వందల కోట్ల రూపాయలు జరిమానాలు చెల్లిస్తున్నారు. అయినా వారిలో మార్పు రావడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లా చూసినా ట్రాఫిక్‌ చలాన్‌ల మోత మోగిపోతోంది. చలాన్‌లలో ఓవర్‌స్పీడ్, హెల్మెట్‌లేని డ్రైవింగ్‌లే అధికం. నిబంధనలు పాటించని వాహనదారులు రూ.కోట్లు చలాన్‌లు కడుతున్నారు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు గణాంకాలను పరిశీలిస్తే... ఒక్క రంగారెడ్డి జిల్లా నుంచి ఖజానాకు రూ.88 కోట్ల ఆదాయం వచ్చింది. నల్లగొండ నుంచి అత్యల్పంగా రూ.4 కోట్లు వసూలయ్యాయి. ఇక కేసుల విషయానికొస్తే.. రంగారెడ్డి జిల్లా నుంచి ఎక్కువ నమోదు కాగా, ఆదిలాబాద్‌ నుంచి తక్కువ నమోదయ్యాయి. చలాన్‌లకు కొత్త చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో టౌన్‌ స్కాన్‌...  
     


– సాక్షి, నెట్‌వర్క్‌

మరిన్ని వార్తలు