‘విన్సన్‌’ పర్వతాన్ని అధిరోహించిన పూర్ణ 

31 Dec, 2019 01:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంటార్కిటికా ఖండంలో ఎత్తయిన విన్సన్‌ మసిఫ్‌ పర్వతాన్ని తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు మాలావత్‌ పూర్ణ ఈ నెల 26న అధిరోహించింది. ప్రపంచంలోనే ఎత్తయిన ఏడు పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంతో రంగంలోకి దిగిన పూర్ణ.. ఎవరెస్ట్, కిలిమంజారో, ఎల్బ్రస్, అకోన్కాగ్వా, కార్ట్స్‌నెజ్‌ పర్వతాలను ఎక్కింది.

తాజాగా విన్సన్‌ మసిఫ్‌ పర్వతాన్ని అధిరోహించింది. ఇప్పటివరకు మొత్తం ఆరు ఎత్తయిన పర్వతాలను ఎక్కింది. ఉత్తర అమెరికాలోని దెనాలి పర్వతాన్ని అధిరోహించడమే మిగిలి ఉందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిరుపేద గిరిజన కుటుంబం నుంచి వచ్చిన తనకు తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారంతోనే ఈ స్థాయికి వచ్చినట్లు పేర్కొంది. తనకు సహకారం అందించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు, గురుకుల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నీరుకూ కరోనా భయమే..! 

ప్రాణం తీసిన కరోనా కంచె 

నేటి ముఖ్యాంశాలు..

కరోనా అనుమానితుల తరలింపునకు ఆర్టీసీ

‘క్వారంటైన్‌’ ఇళ్లకు జియో ట్యాగింగ్‌ 

సినిమా

మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ

బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌

ఏఆర్‌ రెహమాన్‌ కచ్చేరీలు రద్దు 

కరోనా విరాళం

17 ఏళ్లు... 20 సినిమాలు