ప్రభుత్వానికి ముందుచూపు లేదు: ఎంపీ అర్వింద్‌

9 Apr, 2020 12:27 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : మరికొన్ని వారాలు లాక్‌డౌన్‌​ కొనసాగుతుందని, దానికి అందరూ సహకరించాలని నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కోరారు. తెలంగాణలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని ఆయన పేర్కొన్నారు. గురువారం జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. జనాభా ఎక్కువ ఉన్న ఉత్తర ప్రదేశ్‌ కంటే తెలంగాణలో అధిక కేసులు నమోదవ్వడం ఆదోళన కలిగించే అంశమన్నారు. రైతులకు గన్ని బ్యాగులు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. ప్రభుత్వానికి ముందు చూపు లేదని, టమాట రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎంపీ అర్వింద్‌ సూచించారు.. (క్యాస్టింగ్‌ కౌచ్‌: రాజీకొస్తే ఇంతకంటే ఎక్కువ ఇస్తా! )

ఇక అమెరికాకు మందులు పంపిణీ చేసే స్థాయికి మన దేశాన్ని తీసుకెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పని చేయడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా కరోనాపై పోరాటం చేయాల్సిన సమయమిదని పేర్కొన్నారు. కరోనాపై కేంద్రం ఎప్పటికప్పుడూ పార్లమెంట్‌ సభ్యులతో చర్చిస్తుందని ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్‌ తెలిపారు. (నీకు తోడుగా ఉంటా: బిగ్‌బాస్‌ రన్నరప్‌ )

మరిన్ని వార్తలు