దేశానికి ఆదర్శం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 

4 Jun, 2018 10:42 IST|Sakshi
శిలాఫలకాన్ని ఆవిష్కరించిన  ఎంపీ, ఎమ్మెల్యేలు

గుడిహత్నూర్‌ : దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వం మనదని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌ అన్నారు. మండలంలోని సీతాగోంది జాతీయ రహదారి నుంచి మల్కాపూర్‌ మీదుగా మాలే బోరిగాం వరకు రూ.186 లక్షలు, మండల కేంద్రంలోని పెట్రోల్‌ పంపు నుంచి దాజీతండా వరకు రూ.140 లక్షలతో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద నిర్మించి చేపట్టనున్న బీటీ రోడ్లకు వీరు భూమి పూజ చేసి మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం మునుపు ఎన్నడూ లేని విధంగా తీసుకొస్తున్న విప్లవాత్మక నిర్ణయాలు పథకాలు దేశంలో ప్రథమస్థానంలో నిలిచాయన్నారు.

అన్ని సమాజిక వర్గాలకు న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్‌ అందిస్తున్న పథకాలు ప్రజాదరణ  పొందడమే కాకుండా దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అంతకు ముందు వీరు శిలాఫలకాలను ఆవిçష్కరించి పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు ఉయిక కమల, రాథోడ్‌ ప్రతాప్, ఏఎంసీ చైర్మన్‌ ఆడే శీల, ఎంపీపీ కుమ్మరి సత్యరాజ్, జెడ్పీటీసీ కేశవ్‌ గిత్తే, ఎంపీటీసీ లక్ష్మీ, రైతు సమితి మండల కన్వీనర్‌ కరాఢ్‌ బ్రహ్మానంద్, జిల్లా టీఆర్‌ఎస్‌ నాయకులు సుధాకర్‌రెడ్డి, సర్పె సోంబాయి, జాదవ్‌ రమేశ్, ఎండీ గఫార్, అబ్దుల్‌ గపార్, వామన్‌ గిత్తే, పాటిల్‌ రాందాస్, విలాస్‌ తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు