కేటీఆర్‌కు రాఖీ కట్టిన చిన్నారి దివ్య 

27 Aug, 2018 01:25 IST|Sakshi
,మంత్రి కేటీఆర్‌కు రాఖీ కడుతున్న చిన్నారి దివ్య ,కేటీఆర్‌కు రాఖీ కడుతున్న కవిత. చిత్రంలో కేటీఆర్‌ సతీమణి శైలిమ

సాక్షి, హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ చిన్నారికి రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాఖీ బహుమతిగా ఆపన్నహస్తం అందించారు. గత ఏప్రిల్‌లో కూకట్‌పల్లి నియోజకవర్గం అల్లాపూర్‌కు చెందిన 9 ఏళ్ల దివ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. కిరాయి ఆటోని నడుపుకుని జీవనోపాధి పొందుతున్న ఆమె తండ్రి చికిత్సకు డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాడని స్థానిక టీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు జగన్మోహన్‌రావు ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌ తక్షణమే స్పందించి దివ్యకు చికిత్స అందించాలని నిమ్స్‌ వైద్యాధికారులను ఆదేశించారు.

ఈ ప్రమాదంలో దివ్య ఎడమకాలిని పోగొట్టుకోవడం విషాదంగా మారింది. ఆపదలో అన్నలా ఆదుకున్న కేటీఆర్‌కు రాఖీ కట్టాలన్న తన ఆకాంక్షని దివ్య వెలిబుచ్చింది. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్‌ ఆమెను ఆదివారం తన ఇంటికి పిలిపించుకుని రాఖీ కట్టించుకున్నారు. ఆమెకు కృత్రిమ అవయవాన్ని అందించారు. అవసరమైతే మరింత సహాయం దివ్యకు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే తనతో రాఖీ కట్టించుకోవడమే పెద్ద బహుమతి అన్న దివ్య, ఇంకేం వద్దంటూ మంత్రికి తెలిపింది.

దివ్య తండ్రి కిరాయి ఆటో నడిపిస్తున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి, త్వరలోనే అయనకు ఒక కొత్త ఆటోను రాఖీ బహుమతిగా అందిస్తానని హామీ ఇచ్చారు. దివ్యను అన్నలా ఆదుకున్న మంత్రి తారక రామారావుకు తాము జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా దివ్య తల్లిదండ్రులు తమ ఆనందన్ని వ్యక్తం పరిచారు.  

కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత  
మంత్రి కేటీఆర్‌కు ఆయన సోదరి, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాఖీ కట్టారు. కేటీఆర్‌ సతీమణి శైలిమ కూడా కవిత భర్త అనిల్‌ కుమార్‌కు రాఖీ కట్టారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హరీశ్‌, జీవన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం

వలస విధానంపై నిర్దిష్ట లక్ష్యాలు అవసరం

‘కేటీఆర్‌ ట్వీట్‌ కొండంత అండనిచ్చింది’

బూర్గులకు గవర్నర్‌ దత్తాత్రేయ నివాళి

దేవుడిసాక్షిగా మద్య నిషేధం

నిర్లక్ష్యానికి మూడేళ్లు!

జర్నలిస్టులు నిష్పాక్షికంగా వ్యవహరించాలి

డెంగీ భయం వద్దు: ఈటల

రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

కేశంపేట, కొందుర్గు తహసీల్దార్లకు నోటీసులు

గిట్లనే చేస్తే కేంద్రంపై తిరుగుబాటు

స్వగ్రామంలో కిషన్‌రెడ్డి పర్యటన

‘ప్రణాళిక’ సరే..పైసలేవి?

పట్టు దిశగా కమలం అడుగులు

ఉల్లి.. లొల్లి..

కేసీఆర్‌ వారి చరిత్రను తొక్కిపెడుతున్నారు

పురుగులమందు తాగి విద్యార్థి ఆత్మహత్య

మరోసారి ఝలక్‌ ఇచ్చిన ఈటల

మంత్రివర్గంలో సామాజిక న్యాయమేది?

చేపా చేపా.. ఎప్పుడేదుగుతవ్‌ !

గతేడాది కత్తెర పురుగు.. ఇప్పుడు మిడతలు

బీఏసీకి దూరంగా ఉండనున్న ఈటల, ఎర్రబెల్లి

అక్రమ రవాణాను అడ్డుకున్న ‘ప్రమాదం’ 

పట్టాలెక్కని గద్వాల - మాచర్ల రైల్వే లైను

ముందుకు పడని.. అడుగులు!

అనుమానాస్పద మృతి కాదు..

టీఆర్‌ఎస్‌లో చేరేముందు హామీయిచ్చా..

తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు

కోక్‌ టిన్‌లో చిక్కి నాగుపాము విలవిల

కొత్త వాహన చట్టంతో అంతా అలర్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బ్రేకింగ్‌.. శిల్పా ఎలిమినేటెడ్‌!

‘ఈ కోటి రూపాయలు మా నాన్నవే’

మరో రీమేక్‌లో ‘ఫలక్‌నుమా దాస్‌’

అఖిల్‌కు జోడి దొరికేసింది!

సైరా : గ్రాఫిక్స్‌కే భారీగా..!

వినాయక్‌ సినిమా మొదలవుతోంది!