‘రైతు గురించి ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్‌’

13 May, 2018 12:45 IST|Sakshi
ఎంపీ కవిత (పాత ఫోటో)

సాక్షి, నిజామాబాద్‌: రైతుల గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరులో రైతుబంధు చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గుత్తా సుఖేందర్‌రెడ్డి, తదితరులు చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. దేశంలో ప్రతి రైతుకు బీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. ప్రతి ఎకరానికి నీరందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 17 వేల కోట్లు రుణమాఫీ  చేశారని గుర్తుచేశారు.

గుత్తా సుఖేందర్‌ మాట్లాడుతూ.. దేశంలోనే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని వ్యాఖ్యానించారు. ఈ పథకాలు ఎన్నికల కోసమేనంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.  రైతులు పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచాలనే ఉద్దేశ్యంతోనే రైతు బంధు పథకం పెట్టామని, ఖరీఫ్‌లో కూడా రైతులకు ఎకరానికి నాలుగు వేలు అందిస్తామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు