ఆడబిడ్డల ఆదరణతో మళ్లీ అధికారంలోకి

18 May, 2017 03:05 IST|Sakshi
ఆడబిడ్డల ఆదరణతో మళ్లీ అధికారంలోకి

ఓర్వలేకపోతున్న ప్రతిపక్షాలు: ఎంపీ కవిత

నిజామాబాద్‌ రూరల్‌ (మోపాల్‌): రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు సంతోషపడుతుంటే.. దాన్ని జీర్ణించుకోలేకపోతున్న విపక్ష నాయకులు అధికార దాహంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్‌ రూరల్‌ మండలం గుండారం గ్రామంలో నిజాంసాగర్‌ కెనాల్‌ డి–50 నుంచి డి–63 వరకు రూ. 28 లక్షలతో చేపట్టనున్న ఆ«ధునికీకరణ పనులకు బుధవారం కవిత శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా బహిరంగసభలో ఆమె కాంగ్రెస్, టీడీపీ నాయ కులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్‌ మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకున్న మహిళలకు రూ.12 వేల ఆర్థిక çసహాయం జూన్‌ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆడబిడ్డ రూపంలో ప్రతి గ్రామంలో ఒక కేసీఆర్‌ ఉన్నారని అభివర్ణించారు. 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో ఆడబిడ్డల ఆద రణతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం అందించే సాయం మహిళల పేరిట ఇవ్వాలని తాను సీఎం దృష్టికి తీసుకుకెళ్లినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు