ఎంపీ కవితకు ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు

1 Feb, 2019 08:21 IST|Sakshi
ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డును అందుకుంటున్న ఎంపీ కవిత

చంద్రశేఖర్‌కాలనీ: నిజామాబాద్‌ ఎంపీ కవిత ఫ్రేమ్‌ ఇండియా–ఏషియా పోస్ట్‌ మ్యాగజైన్‌ బెస్ట్‌ పార్లమెంటేరియన్‌ అవార్డును అందుకున్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌ ఎంపీకి అవార్డును అందజేశారు. దేశం లోని మొత్తం 545 మంది ఎంపీలకుగాను మ్యాగ జైన్‌ సర్వే ద్వారా 25 మందిని ఉత్తమ ఎంపీలుగా ఎంపిక చేసింది. ప్రజాదరణ, కార్యశీలత, సామాజిక సేవాదృక్పథం, లోక్‌సభకు హాజరు, లోక్‌సభ నిర్వహణలో పాత్ర, నియమనిబంధనలు పాటించడం, ప్రశ్నలగడం తదితర అంశాల ఆధారంగా ఎంపీలను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. సర్వే నిర్వహించిన అత్యధిక విభాగాల్లో ఎంపీ కవితకు 90 శాతానికిపైగా పాయింట్లువచ్చాయి.

కవిత తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, క్రియాశీలకంగా వ్యవహరించారని సర్వే రిపోర్టు పేర్కొన్నది. రాజనీతి, ఉద్యమకారిణి, అనవ్య ప్రతిభాశాలిగా, సామాజిక సేవాధృక్పథం, ప్రజాదరణ, కార్యశీలత తదితర అంశాల్లో ఆమెకు మంచి గుర్తింపు లభించిందని మ్యాగజైన్‌ పేర్కొఇంది. కళా సంస్కృతిని రక్షిచడంలో, మంచి మహిళా వక్తగా ఆమె పేరు పొందారని వివరించింది. అమెరికా నుంచి వచ్చి తెలంగాణ ఉద్యమంలో భాగంగా సాంస్కృతిక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రజలను చైతన్యపర్చడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని సంస్థ పేర్కొంది.

బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో ఆమె చురుగ్గా వ్యవహరించారని, తెలంగాణ సంస్కృతిక సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించారని వివరించింది. అవార్డు అందుకున్న ఎంపీ కవితకు అభిమానులు అభినందనలు తెలిపారు. అంతకుముందు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ నివాసానికి వెళ్లి స్పీకర్‌ ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు జితేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్, సంతోష్‌కుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు