వరంగల్‌ జనసంద్రాన్ని తలపిస్తోంది!

27 Apr, 2017 19:37 IST|Sakshi

వరంగల్‌: ఆకాశాన్ని బద్దలుకొట్టి మరీ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ సాధించారని, ఇప్పుడు సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మలిచేందుకు ఆయన కష్టపడుతున్నారని టీఆర్‌ఎస్‌ ఎంపీ, సీనియర్‌ నేత కే కేశవరావు అన్నారు. వరంగల్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభలో కేకే ప్రసంగించారు.

గత మూడేళ్లలో ఎవరూ ఊహించని అభివృద్ధిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాధించిందని పేర్కొన్నారు. అశేష జనావళి తరలివచ్చిన వరంగల్‌ జనసంద్రాన్ని తలపిస్తున్నదని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కారు మూడేళ్లలో ఏం సాధించిందో తెలియజేయడానికే వరంగల్‌లో ఈ సభను ఏర్పాటుచేసినట్టు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు