మీరు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడలేరు!

27 Mar, 2020 16:07 IST|Sakshi
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సాక్షి, భువనగిరి: కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లాక్‌డౌన్‌ విధించిన కారణంగా తీర్థయాత్రలకు వెళ్లిన దాదాపు వెయ్యి మంది తెలుగువాళ్లు కాశీలో చిక్కుకుపోయారు. వీరిలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పోచంపల్లి మండలం దేశ్‌ముఖ్ గ్రామానికి చెందిన బుచ్చయ్యతో పాటుగా 25 మంది ఉన్నారు. వీరితో పాటు సంగారెడ్డికి చెందిన 16 మంది, కరీంనగర్‌ జిల్లావాసి ఒకరు ఉన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా కాశీలో చిక్కుకుపోయిన వారందరూ 60 ఏళ్లు పైబడిన వారే. అయితే తాము బీపీ, షుగర‍్లతో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంట తీసుకువెళ్లిన మందులు, డబ్బులు అయిపోయాయని చాలా ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. సీఎం కేసీఆర్‌, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డిలే తమని ఆదుకోవాలని విన్నవించుకుంటున్నారు. 

అయితే  విషయం తెలుసుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు.  కాశీలో చిక్కుకున్న వారికి వెంటనే వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలని కోరారు. వారిని సాధ్యమైనంత త్వరగా వారి స్వస్థలాలకు చేర్చాలని కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కిషన్‌రెడ్డి అక్కడి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వారికి అన్ని ఏర్పాట్లు చేసి వారి స్వస్థలాలకు పంపుతామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హామీ ఇచ్చారు. 

తెలంగాణలో 47కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా