బీసీలకు ప్రభుత్వం పెద్దపీట

20 Mar, 2017 16:44 IST|Sakshi

రఘునాథపాలెం: బంగారు తెలంగాణ సాధనలో భాగంగా సీఎం కేసీఆర్‌ బీసీలకు, కుల వృత్తులకు పెద్దపీట వేశారని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని వీవీపాలెంలో రూ.51 లక్షలతో వివిధ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. 48 ఏళ్లపాలనలో సాధించిన ప్రగతి కంటే తెలం గాణ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ఎంతో సాధించిందని పేర్కొన్నారు. ప్రాంతం, కులం, మతం అనే తేడా లేకుండా అన్నిరంగాల్లో అన్ని వర్గాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

కుల వృత్తులకు ప్రాధ్యానమిస్తూ వారిని ఆర్థికంగా ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగానే గొర్రెల పెంపకంలో యాదవులకు రూ.75వేలు సబ్సిడీని తీసుకొచి్చనట్లు తెలిపారు. అంతా కలిసికట్టుగా ఉంటే అభివృద్ధి సాధించవచ్చన్నదానికి వీవీపాలెం నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ గ్రామాన్ని తనకున్న అవకాశాల మేరకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. గ్రామంలో ప్రధాన సమస్యగా ఉన్న పశువుల వైద్యశాలను నిర్మించే విషయంలో తాను బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు.

నిర్మాణంలో ఉన్న గ్రామ పం చాయతీ భవనం వేగంగా పూర్తి చేయాలని కోరారు. గ్రామ సర్పంచ్‌ ఆవుల హేమలత, సొసైటీ చైర్మన్ రావెళ్ల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో జెడ్పీటీసీ ఆజ్మీరా వీరునాయక్, వైస్‌ఎంపీపీ యరగర్ల పద్మ, ఉపసర్పంచ్‌ శంకర్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు కూరాకుల నాగభూషణం, యరగర్ల హనుమంతరావు, ఆవుల కోదండరాములు, జంగాల శ్రీను మాట్లాడారు.

కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్ మందడపు నరసింహారావు, ఆత్మచైర్మన్ మెంటం రామారావు, తహసీల్దార్‌ తిరుమలాచారి, ఎంపీడీఓ ఏలూరి శ్రీనివాసరావు, రామోజీ, రమణ, కుతుంబాక నరేష్, యరగర్ల హనుమంతరావు, హెచ్‌ఎం శ్రీదేవి, నరసింహా రావు, పిన్ని కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పువ్వాడ పౌండేషన్, సునంద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 15 బల్లాలను ఎంపీ, ఎమ్మె ల్యే పంపిణీ చేశారు. పువ్వాడ ఫౌండేషన్ ద్వారా నోటు పుస్తకాలను అందించారు.

మరిన్ని వార్తలు