ఎంపీ పొంగులేటికి ఎల్‌ఐసీ ఏజెంట్ల వినతి

22 Feb, 2015 05:17 IST|Sakshi
ఎంపీ పొంగులేటికి ఎల్‌ఐసీ ఏజెంట్ల వినతి

సాక్షి, ఖమ్మం : ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియూ (ఎల్‌ఐఏఎఫ్‌ఐ) కార్యవర్గం శనివారం వినతిపత్రం అందజేసింది. ఎల్‌ఐసీ పాలసీలపై కేంద్ర ప్రభుత్వం నూతనంగా పెనుభారం మోపుతోందని కార్యవర్గ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌ఐసీ పాలసీలపై కేంద్ర ప్రభుత్వం సర్వీస్ ట్యాక్స్, ఇన్‌కం ట్యాక్స్‌లతో ఏజెంట్లను ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. జిల్లాలో వేలాది మంది ఎల్‌ఐసీ ఏజెంట్లుగా జీవనం సాగిస్తున్నారని వారందరికీ న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు.

దీనికి స్పందించిన పొంగులేటి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని  ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాసంగుల రామారావు, కామిని రమేష్, నిమ్మలగడ్డ రాము, నల్లమోతు రవీంద్రబాబు, ఎస్.సాంబశివరావు, ఎన్.సతీష్‌కుమార్, టి.నారాయణచారి, కేతేపల్లి శ్రీనివాసరావు, కె.సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు