కేటీఆర్‌ బర్త్‌డే.. వారికి చాలెంజ్‌ విసిరిన ఎంపీ

23 Jul, 2019 19:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజు(జులై 24) సందర్భంగా సోషల్‌ మీడియాలో ఓ చాలెంజ్‌ వైరల్‌ అవుతోంది. ఈ చాలెంజ్‌ సినీ ఇండస్ట్రీ వరకు వెళ్లింది. ఎంపీ సంతోష్‌ ఈ చాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకుని.. కీసరగుట్ట రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు  ప్రకటించారు. అంతేకాకుండా ఈ చాలెంజ్‌ను ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి, మాజీ ఎంపీ కవిత, విజయ్‌ దేవరకొండ, నితిన్‌లకు విసిరారు. 

దీనికి స్పందిస్తూ.. ‘ఈ చాలెంజ్‌ను విసిరినందుకు ధన్యవాదాలు, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో అవసరం’ అంటూ వంశీ పైడిపల్లి ట్వీట్‌ చేశాడు. తన పుట్టిన రోజు సందర్భంగా హంగు, ఆర్భాటాలు లేకుండా సమాజహితం కోసం పని చేయాలని కేటీఆర్‌ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అటవీశాఖ ద్వారా అమలు చేస్తున్న అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల అభివృద్ధిలో భాగంగా కీసరగుట్ట అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం పార్కును సొంత నిధులతో తీర్చిదిద్దుతాం అని సంతోష్‌ కుమార్‌ పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు