కరోనా ఎఫెక్ట్‌; ఫోన్‌లో పెళ్లి దీవెనలు

20 Mar, 2020 18:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నూతన వధూవరులను వీడియో కాలింగ్‌ ద్వారా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ఆశీర్వదించారు. తన వద్ద సెక్యురిటీగా పనిచేస్తున్న నరేందర్ గౌడ్ శుక్రవారం ఉమారాణిని పెళ్లి చేసుకున్నారు. భువనగిరి పట్టణంలోని వైఎస్ఆర్ గార్డెన్‌లో జరిగిన ఈ పెళ్లికి సంతోష్‌కుమార్‌ తన కుటుంబ సభ్యులతో సహా హాజరు కావాలనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన తన ప్రయాణాన్ని విరమించుకుని, తన అంగరక్షకుడికి ఫోన్‌ ద్వారా శుభాశీస్సులు అందజేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఎవరు కూడా బయటకు వెళ్లవద్దని, వివాహాలకు శుభకార్యాలకు ఎక్కువమంది హాజరు కావద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. (పారాసిటమాల్‌ మింగి.. దర్జాగా ఇంటికి..!)

స్వయంగా వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించాలని అనుకున్నప్పటికీ కరోన వైరస్ ప్రభావం వల్ల వెళ్లలేకపోయానని ఎంపీ సంతోష్‌కుమార్‌ తెలిపారు. పెళ్లికి వెళ్లలేకపోయినందుకు మనసులో బాధ ఉన్నప్పటికీ కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనలను పాటించినట్టు చెప్పారు. ప్రముఖులు, ప్రజలు అందరు కూడా జనసమూహానికి దూరంగా ఉండాలని.. అవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దని సంతోష్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. (ఎయిర్‌పోర్ట్‌ నుంచి అలా బయటకు వచ్చాం..)

మరిన్ని వార్తలు