దళితుల అభివృద్ధికి సమగ్ర విధానం

29 Jan, 2017 02:44 IST|Sakshi
దళితుల అభివృద్ధికి సమగ్ర విధానం

ఎంపీ సీతారాం నాయక్‌
సాక్షి, న్యూఢిల్లీ: దళితులను అభివృద్ధిపథంలోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, అందుకు నిదర్శనంగా అన్ని పార్టీలకు చెందిన దళిత ప్రజాప్రతినిధులతో కమిటీలు ఏర్పాటు చేసి విధానాల రూపకల్పనకు నడుం బిగించారని టీఆర్‌ఎస్‌ ఎంపీ సీతారాం నాయక్‌ అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులను పరిరక్షించి వాటిని అమలు చేయడానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంకల్పంతో ఉందన్నారు.

బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ శాతం నిధులు కేటాయించడానికి, ఆయా నిధులను ఖర్చు చేయడానికి అవసరమైన విధానాలను రూపొందించడానికి కమిటీలు ఏర్పాటు చేయడం శుభపరిణామని పేర్కొన్నారు. అర్బన్, సెమీ అర్బన్, రూరల్‌గా విభజించి ఏ పాంత్రాల్లో ఎలాంటి పథకాలు అమలు చేయడం వల్ల ఎక్కువ మంది దళితులకు లబ్ధి చేకూరుతుందో అధ్యయనం చేస్తామని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో దళితులకు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన ఫలాలు అందకుండా పోయాయని సీతారాం నాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు