ఓటుకు నోట్లు ; ఇదేం ఆదర్శంరా బాబూ..!

9 Jun, 2019 10:45 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల : స్థానిక సంస్థల సంరంభం శనివారంతో ముగిసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లను గెలుచుకొని టీఆర్‌ఎస్‌ కొత్త చరిత్ర సృష్టించింది. శనివారం 32 జిల్లాల్లో జెడ్పీపీ పదవులకు జరిగిన ఎన్నికల్లో 32 జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్, కో ఆప్షన్‌ పదవులన్నింటినీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మండల ప్రజా పరిషత్‌ (ఎంపీపీ) అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లోనూ అధికార టీఆర్‌ఎస్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 436 మండల పీఠాలను గెలుచుకుని సత్తా చాటింది.

ఇక మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం లింగయ్య పల్లెలో ఓ వినూత్న ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ తరపున ఎంపీటీసీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన మాదాడి హన్మంతరావు అనే వ్యక్తి ఓటమిపాలయ్యారు. దీంతో ఎన్నికల్లో పంపిణీ చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చాలామంది తాము తీసుకున్న డబ్బుల్ని తిరిగిచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఓటుకు నోట్లు పంచిన ఓ వ్యక్తి తిరిగి చెల్లించమనడం.. ఇదే మా ఆదర్శం అంటూ ప్రజలు స్పందించడం భలే యావ్వారం అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు