ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు

5 Mar, 2019 07:07 IST|Sakshi

కామారెడ్డి జిల్లాలో..236 స్థానాల్లో 123 మహిళలకు..

కొనసాగుతున్న జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ల కసరత్తు

సాక్షి, కామారెడ్డి: మండల పరిషత్‌ ప్రాదేశిక స్థానాల (ఎంపీటీసీ)కు సంబంధించి సామాజిక వర్గాలవారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లాలో 22 మండలాల పరిధిలో 236 ప్రాదేశిక స్థానాలు ఉన్నాయి. ఇందులో 123 స్థానాలను మహిళలకు రిజర్వ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ సత్యనారాయణ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఆయా మండలాల్లో జనాభా ప్రాతిపదికన ఏ ప్రాదేశిక స్థానం ఏ సామాజిక వర్గానికి రిజర్వు అవుతుందో ఖరారు చేయాల్సి ఉంది. అలాగే మండల పరిషత్‌ అధ్యక్షులకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు కావాల్సి ఉంది. జిల్లా ప్రాదేశిక స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల కసరత్తు జరుగుతోంది. త్వరలోనే వాటి వివరాలు వెల్లడించనున్నారు.  
 
మండలాల వారీగా రిజర్వేషన్ల వివరాలు..

  • రామారెడ్డి మండలం : 10 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు ఒకటి, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్‌ మహిళకు రెండు, అన్‌రిజర్వుడు మూడు స్థానాలు.  
  • సదాశివనగర్‌ మండలం : 12 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, బీసీ మహ/æళకు ఒకటి, బీసీ జనరల్‌కు రెండు స్థానాలు కాగా, జనరల్‌ మహిళకు మూడు, అన్‌రిజర్వుడు మూడు.  
  •  తాడ్వాయి మండలం : తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనల్‌కు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్‌ మహిళకు రెండు, అన్‌రిజర్వుడు రెండు స్థానాలు.  
  •  ఎల్లారెడ్డి మండలం : ఎనిమిది మండలపరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు ఒకటి, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్‌ మహిళకు రెండు, అన్‌రిజర్వుడు రెండు.  
  •  గాంధారి మండలం : 15 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్టీ మహిళకు రెండు, ఎస్టీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు ఒకటి, బీసీ జనరల్‌కు రెండు, జనరల్‌ మహిళకు నాలుగు, అన్‌రిజర్వుడు మూడు.  
  • లింగంపేట మండలం : 14 స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్టీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్‌ మహిళకు మూడు, అన్‌రిజర్వుడు నాలుగు స్థానాలు.  
  • నాగిరెడ్డిపేట మండలం : 10 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు ఒకటి, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్‌ మహిళకు రెండు, అన్‌రిజర్వుడు మూడు స్థానాలు.  
  •  బాన్సువాడ మండలం : 11 ఎంపీటీసీ స్థానాలు. ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్టీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్‌ మహిళకు మూడు, అన్‌రిజర్వుడు రెండు స్థానాలు. 
  •  బీర్కూర్‌ మండలం : ఏడు ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జ నరల్‌కు ఒకటి, జనరల్‌ మహిళకు ఒకటి, అన్‌రిజర్వుడు రెండు.  
  •   నస్రుల్లాబాద్‌ మండలం : ఎనిమిది స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్టీ జనరల్‌కు ఒకటి, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్‌ మహిళకు రెండు, అన్‌రిజర్వుడు రెండు.  
  •  జుక్కల్‌ మండలం : 14 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు రెండు, ఎస్టీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్‌ మహిళకు మూడు, అన్‌రిజర్వుడు నాలుగు.  
  •  మద్నూర్‌ మండలం : 17 స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు రెండు, ఎస్సీ జనరల్‌కు రెండు, బీసీ మహిళకు మూడు, బీసీ జనరల్‌కు రెండు, జనరల్‌ మహిళకు నాలుగు, అన్‌రిజర్వుడు నాలుగు స్థానాలు.  
  • నిజాంసాగర్‌ మండలం : 11 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్‌ మహిళకు రెండు, అన్‌రిజర్వుడు మూడు స్థానాలు.  
  • పెద్దకొడప్‌గల్‌ మండలం : ఆరు స్థానాలున్నాయి. ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు ఒకటి, జనరల్‌ మహిళకు ఒకటి, అన్‌రిజర్వుడు రెండు.  
  • బిచ్కుంద మండలం : 14 ఎంపీటీసీ స్థానా లున్నాయి. ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్సీ మహిళ కు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు రెండు, జనర ల్‌ మహిళకు మూడు, అన్‌రిజర్వుడు నాలుగు.
  • పిట్లం మండలం : 13 స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు రెండు స్థానాలు, జనరల్‌ మహిళకు మూడు, అన్‌రిజర్వుడు మూడు స్థానాలు. 

సామాజిక వర్గాలవారీగా.. 

  • జిల్లాలో ఎస్టీలకు 21 ఎంపీటీసీ స్థానాలు కేటాయించగా.. అందులో మహిళలకే 16 స్థానాలు రిజర్వ్‌ అయ్యాయి. ఐదు స్థానాలు మాత్రమే ఎస్టీ జనరల్‌కు మిగిలాయి.  
  • ఎస్సీలకు 39 స్థానాలు కేటాయించగా.. 19 స్థానాలు ఎస్సీ మహిళలకు, 20 స్థానాలు ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ చేశారు.  
  • బీసీలకు 63 స్థానాలు కేటాయించగా.. బీసీ మహిళకు 36 స్థానాలు బీసీ జనరల్‌కు 27 స్థానాలు రిజర్వ్‌ అయ్యాయి.  
  • మిగతా 113 స్థానాలలో 52 స్థానాలు జనరల్‌ మహిళకు, 61 స్థానాలు జనరల్‌కు ఉన్నాయి.

  •  కామారెడ్డి మండలం: ఆరు ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇందులో ఎస్సీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు ఒకటి, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్‌ మహిళకు ఒకటి, అన్‌రిజర్వుడు రెండు. 
  •  భిక్కనూరు మండలం : 14 ఎంపీటీసీ స్థానాలున్నాయి.. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు మూడు, బీసీ జనరల్‌కు రెండు, జనరల్‌ మహిళకు మూడు, అన్‌రిజర్వుడు నాలుగు స్థానాలు. 
  •  బీబీపేట మండలం : ఏడు స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్‌ మహిళకు ఒకటి, అన్‌ రిజర్వుడు రెండు.  
  •  దోమకొండ మండలం : తొమ్మిది ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్‌ మహిళకు రెండు, అన్‌రిజర్వుడు రెండు స్థానాలు.  
  •  రాజంపేట మండలం : 8 స్థానాలున్నాయి. ఎస్టీ మహిళకు 1, ఎస్సీ మహిళకు 1, బీసీ మహిళకు 1, బీసీ జనరల్‌కు 1, జనరల్‌ మహిళకు 2, అన్‌రిజర్వుడు 2.
  •  మాచారెడ్డి మండలం : 13 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్టీ జనరల్‌కు ఒకటి, ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు రెండు, జనరల్‌కు ఒకటి, జనరల్‌ మహిళకు మూడు, జనరల్‌కు మూడు స్థానాలు. 
మరిన్ని వార్తలు