టెన్షన్‌.. టెన్షన్‌

1 Jun, 2019 12:05 IST|Sakshi

సాక్షి, భూపాలపల్లి : మరో నాలుగు రోజుల్లో పరిషత్‌ అభ్యర్థుల భవితవ్యం బాహ్య ప్రంచానికికి తెలియనుంది. జూన్‌ 4న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లను లెక్కించనున్నారు. దీంతో అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ లోలోపల కాస్త గుబులుగానే ఉన్నారు. ఫలితాలు అనుకూలంగా రాకపోతే పరిస్థితేంటి అనే రందిలో ఉన్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రాస్‌ ఓటింగ్‌ పెద్ద ఎత్తున క్రాస్‌ ఓటింగ్‌ జరగడం కూడా అభ్యర్థుల్లో ఉత్కంఠ వాతావరణానికి మరో కారణంగా చెప్పవచ్చు. స్థానికంగా ప్రాధాన్యం ఉన్న ఎన్నికలు కాబట్టి ప్రజలు కూడా స్థానికు వైపే మొగ్గు చూపారు.  కొన్ని ప్రాంతాల్లో పార్టీల కంటే లోకల్‌గా మంచి పేరున్న వ్యక్తికే ఓట్లు వేశారు. ప్రస్తుతం ఈ పరిణామాలే ప్రాధాన పార్టీల అభ్యర్థులను కలవరపెడుతున్నాయి. కొన్ని ఎంపీటీసీ స్థానాల్లో ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు.  

బయటకు ధీమాగా..
ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని పరిషత్‌ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ లోలోప ఒకింత గుబులుగా ఉన్నారు. కార్యకర్తలు గెలుపు మనదే అని అంటున్నప్పటికీ అభ్యర్థులు మాత్రం ఫలితాలు వెలువడే వరకు టెన్షన్‌ వాతావరణంలో కాలం గడపనున్నారు. కొన్ని ముఖ్యమైన స్థానాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ తీవ్ర పోటీ నెలకొంది.  ఇక్కడ బ్యాలెట్‌ తెరిస్తే తప్ప వారి భవితవ్యాన్ని అంచనా వేయలేకపోతున్నారు. మరికొన్ని ప్రాదేశిక స్థానాల్లో స్వతంత్రులు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి ప్రధాన పార్టీలకు చెందిన కార్యకర్తలే టికెట్‌ రాకపోవడంతో స్వతంత్రులుగా బరిలో నిలిచారు. ముఖ్యంగా ఎంపీటీసీ స్థానాల్లో తీవ్ర పోటీ ఉంది. ఎక్కువ స్థానాల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. పార్టీలను చూసి జెడ్పీటీసీ అభ్యర్థులకు ఓటు వేసిన ప్రజలు ఎంపీటీసీకి వచ్చే వరకు స్థానికంగా అందుబాటుతో ఉండే అభ్యర్థి వైపు సానుకూలంగా వ్యవహరించారు.  పోటీ అధికంగా ఉన్న స్థానాల్లో రూ.లక్షల్లో ఖర్చు చేశారు. ఇప్పుడు ఆ స్థానాల్లో గెలుపోటములపై ఇటు అభ్యర్థులు, అటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

లెక్కలేసుకుంటున్న ఆశావహులు
మండల అధ్యక్ష పదవి చేపట్టేందుకు ప్రతీ పార్టీలో ఒకరి కంటే ఎక్కువ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పలు పార్టీలు జెడ్పీ చైర్మన్‌ ఎంపికకు సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలనే స్పష్టత ఉన్నప్పటికీ ఎంపీపీల విషయంలో ఆ క్లారిటీ ఏ పార్టీలో కూడా లేదు. దీంతో కౌంటింగ్‌కు ముందే ఆశావహులు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎంత మంది తమకు మద్దతు పలికే అవకాశం ఉంది. వ్యతిరేకంగా ఉన్న వారిని ఎలా మెప్పించాలనే వ్యూహాల్లో ఎంపీపీ ఆశావహలు ఉన్నారు. ఎన్నికల్లో ఎంత ఖర్చు చేశారో ఆ మెత్తాన్ని ఇస్తాం.. మాకే మద్దతు ఇవ్వాలనే విధంగా ప్రలోభాలు చేసేందుకు ఆశావహులు వెనుకాడడం లేదు. అయితే కౌంటింగ్‌ అనంతరమే అసలు కథ ప్రారంభం కానుంది. కౌంటింగ్‌కు ఎంపీపీ ఎన్నికకు మధ్య రెండు రోజులు సమయం ఉంది. ఈ సమయంలోనే ఆశావహులు ఎంపీటీసీల మద్దతు సంపాదించేందుకు కసరత్తు చేస్తున్నారు.   

భూపాలపల్లి జిల్లాలో పరిషత్‌ స్థానాల వివరాలు  
ఎంపీటీసీ స్థానాలు – 106
పోటీలో ఉన్న అభ్యర్థులు – 325 మంది
జెడ్పీటీసీ స్థానాలు – 11
పోటీచేసిన అభ్యర్థులు – 52 మంది

మరిన్ని వార్తలు