మళ్లీ ఎన్నికల సందడి

17 Mar, 2019 14:09 IST|Sakshi
ఓటర్ల జాబితా సవరణలో నిమగ్నమైన అధికారులు

ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారు! 

సాక్షి, తాడూరు:  గ్రామాల్లో మళ్లీ ఎన్నికల సందడి నెలకొంది. శాసన సభ, సర్పంచ్‌ ఎన్నికలు ముగిసి నెల రోజులు దాటిందో లేదో మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. తాజాగా అధికారులు ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియను చేపట్టడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దీంతో పాటు ఎంపీటీసీ సభ్యుల రిజర్వేషన్లు కొలిక్కి రావడంతో అధికారుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

సర్పంచ్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత నెల రోజుల పాటు స్తబ్ధత ఏర్పడిన తాజాగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో గ్రామాల్లో ఎక్కడ ఎంపీటీసీ రిజర్వేషన్లు గ్రామాల పరిధిపై చర్చ కొనసాగుతుంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు సహితం పోటీకి సమాయత్తం అవుతున్నాయి.  

ఆశావహుల్లో ఉత్కంఠ 
ఆయా స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు ఆశావహుల్లో ఉత్కంఠతో పాటు మరి కొంత మంది ఏ విధంగా బరిలోకి దిగాలన్న ఆలోచనలో పావులు కదుపుతున్నారు. గ్రామాల పునర్విభజన చేయడంతో కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. మండలంలో ఆరు కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశారు.

గతంలో గ్రామాలలో ఆశించిన స్థాయిలో రిజర్వేషన్లు కాకపోవడం, ప్రస్తుతం రిజర్వేషన్లు అయిన తర్వాత అనుకూలంగా రాకపోవడంతో ఆశవాహుల్లో కొంత మేరనిరాశ, ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి నుంచి ఆయా పార్టీల నాయకులు మాజీ సర్పంచ్‌లు, ప్రస్తుత సర్పంచ్‌లతో మంతనాలు మొదలయ్యాయి. దీంతో మండలంలో ఎన్నికల సందడి నెలకొంది.

రిజర్వేషన్లు ఇలా.. 
జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు జనరల్‌ మహిళకు కేటాయించగా, పది ఎంపీటీసీ స్థానాలకు సిర్సవాడ జనరల్, భల్లాన్‌పల్లి జనరల్‌ మహిళ, తుమ్మలసుగూరు జనరల్, చర్ల తిర్మలాపూర్‌ ఎస్సీ మహిళ, ఇంద్రకల్‌ జనరల్‌ మహిళ, తాడూరు బీసీ మహిళ, యాదిరెడ్డిపల్లి బీసీ జనరల్, అల్లాపూర్‌ ఎస్సీ జనరల్, మేడిపూర్‌ జనరల్, అంతారం బీసీ మహిళ రిజర్వేషన్లు ఖరారయ్యాయి.   

మరిన్ని వార్తలు