కొనసాగుతున్నములుగు బంద్

17 Nov, 2015 12:28 IST|Sakshi

ములుగు: వరంగల్ జిల్లా ములుగును జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండ్‌తో మంగళవారం ములుగులో బంద్ నిర్వహిస్తున్నారు. జిల్లా సాధన సమితి, అఖిలపక్షం, అన్ని కుల సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ములుగు బంద్ జరుగుతోంది. వ్యాపారసంస్థలు, సినిమాహాళ్లు, హోటళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు