‘కారు’ జోరు; నేరేడుచర్లలో ఉత్కంఠ

27 Jan, 2020 17:27 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో ఒక్కస్థానం మినహా అన్నింటిని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. చండూరు మున్సిపాలిటీని కాంగ్రెస్‌ దక్కించుకుంది. కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఎక్స్‌ ఎక్స్‌ అఫిషియో ఓటు వివాదంతో నేరేడుచర్లలో మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు సమానంగా ఓట్లు రావడంతో నేరేడుచర్ల ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఉదయం కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం తర్వాత నేరేడుచర్ల మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా, పది మున్సిపాలిటీల్లోనే స్పష్టమైన ఆధిక్యం సాధించిన టీఆర్‌ఎస్‌.. ఎక్స్‌ అఫిషియో సభ్యులు, స్వతంత్రులు, సీపీఎం మద్దతుతో మిగిలి 16 స్థానాలను కైవసం చేసుకుంది.

మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల వివరాలు..
1. నల్గొండ మున్సిపల్‌ చైర్మన్‌గా మందడి సైదిరెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ ఎన్నిర మంగళవారానికి వాయిదా పడింది.
2. మిర్యాలగూడ మున్సిపల్‌ చైర్మన్‌గా తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్‌గా కుర్ర కోటేశ్వరరావు ఎన్నిక
3. దేవరకొండ మున్సిపల్‌ చైర్మన్‌గా ఆలంపల్లి నర్సింహ్మ, వైస్ చైర్మన్‌గా ఎం.డీ రహాత్ అలీ ఎన్నిక
4. నందికొండ-సాగర్ మున్సిపల్‌ చైర్మన్‌గా కర్ణ అనూష వైస్ చైర్మన్‌గా మంద రఘువీర్ ఎన్నిక
5. హాలియా మున్సిపల్‌ చైర్మన్‌గా వెంపటి పార్వతమ్మ, వైస్ చైర్మన్‌గా సుధాకర్ ఎన్నిక
6. చిట్యాల మున్సిపల్‌ చైర్మన్‌గా కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి, వైస్ చైర్మన్‌గా కూరేళ్ల లింగస్వామి ఎన్నిక
7. చండూరు మున్సిపల్‌ చైర్మన్‌గా తోకల చంద్రకళ (కాంగ్రెస్), వైస్ చైర్మన్‌గా దోటి సుజాత ఎన్నిక
8. యాదాద్రి-భువనగిరి జిల్లా: భువనగిరి మున్సిపల్‌ చైర్మన్‌గా ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య ఎన్నిక
9. యాదగిరిగుట్ట మున్సిపల్‌ చైర్మన్‌గా ఎరుకల సుధ ఎన్నిక
10. ఆలేరు మున్సిపల్‌ చైర్మన్‌గా వసపరి శంకరయ్య ఎన్నిక
11. చౌటుప్పల్ మున్సిపల్‌ చైర్మన్‌గా వెన్ రెడ్డి రాజు, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం(సీపీఎం) ఎన్నిక
12. మోత్కూరు మున్సిపల్‌ చైర్మన్‌గా టిపిరెడ్డి సావిత్రి, వైస్ చైర్మన్‌గా బొల్లేపల్లి వెంకటయ్య ఎన్నిక
13. భూదాన్ పోచంపల్లి మున్సిపల్‌ చైర్మన్‌గా చిట్టిపోలు విజయలక్ష్మి, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి ఎన్నిక
14. సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపల్‌ చైర్మన్‌గా పెరుమాళ్ళ అన్నపూర్ణ, వైస్ చైర్మన్‌గా పుట్ట కిషోర్ ఎన్నిక
15. కోదాడ మున్సిపల్‌ చైర్మన్‌గ వనపర్తి శిరీష,వైస్ చైర్మన్‌గా వెంపటి పద్మ ఎన్నిక
16. హుజూర్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా అర్చన రవి, వైస్ చైర్మన్‌గా జక్కుల నాగేశ్వరరావు ఎన్నిక
17. తిరుమలగిరి మున్సిపల్‌ చైర్మన్‌గా పోతరాజు రజిని ఎన్నిక
18. నేరేడుచర్ల మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక మంగళవారం జరుగుతుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు