నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్‌ హవా

27 Jan, 2020 19:28 IST|Sakshi
దండు నీతు కిరణ్‌, మహ్మద్‌ ఇద్రీస్‌ఖాన్‌

సాక్షి, నిజామాబాద్‌: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో బీజేపీకి టీఆర్‌ఎస్‌ చెక్‌ పెట్టింది. నిజామాబాద్‌ నగర పాలక సంస్థతో పాటు ఆరు మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుచుకుంది. ఎంఐఎం మద్దతుతో నిజామాబాద్‌ నగర పాలక సంస్థను  టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మేయర్‌గా 11వ వార్డు కార్పొరేటర్‌ దండు నీతు కిరణ్‌, డిప్యూటీ మేయర్‌గా 14వ వార్డు కార్పొరేటర్‌ మహ్మద్‌ ఇద్రీస్‌ఖాన్‌ ఎన్నికయ్యారు. మేయర్‌ పోటీలో నీతు కిరణ్‌పై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి లావణ్యకు 29 మంది మద్దతు తెలపగా, నీతూ కిరణ్‌కు 38 మంది మద్దతు ప్రకటించారు. డిప్యూటీ మేయర్‌ పోటీలో ఎంఐఎం అభ్యర్థి ఇద్రీస్‌ఖాన్‌కు 38 మంది, బీజేపీ అభ్యర్థి మల్లేశ్‌ యాదవ్‌కు 29 మంది మద్దతు తెలిపారు.

మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల వివరాలు..
1. ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా పండిత్‌ వనిత‌, వైస్‌ చైర్మన్‌గా షేక్‌ మున్నా ఎన్నిక
2. బోధన్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా తూము పద్మ, వైస్‌ చైర్మన్‌గా మహ్మద్‌ ఏతేషామ్‌ ఎన్నిక
3. భీంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా మల్లెల రాజశ్రీ, వైస్‌ చైర్మన్‌గా గున్నాల బాల భగత్‌ ఎన్నిక.
4. కామారెడ్డి జిల్లా: కామారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌గా నీతు జాహ్నవి, వైస్‌ చైర్మన్‌గా గడ్డం ఇందుప్రియ ఎన్నిక.
5. ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌గా కుడుముల సత్యనారాయణ, వైస్‌ చైర్మన్‌గా మస్త్యాల సుజాత ఎన్నిక.
6. బాన్సువాడ మున్సిపల్‌ చైర్మన్‌గా జనగాం గంగాధర్‌, వైస్‌ చైర్మన్‌గా షేక్‌ జుబేర్‌ ఎన్నిక.

మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు వీరే

మరిన్ని వార్తలు