బహుముఖ పోటీ..!

26 Aug, 2018 10:51 IST|Sakshi

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికకు ముహూర్తం ముంచుకొస్తోంది. మరో ఆరు రోజులే ఉండడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు వేగిరం చేశారు. తమకంటే తమకే అవకాశం కల్పించాలంటూ పలువు రు కౌన్సిలర్లు పార్టీ అధినాయకత్వాన్ని గట్టిగానే కోరుతున్నారు. తమతో చేసుకున్న ఒప్పందాలను సైతం ఏకరువు పెట్టడానికి వారు వెనుకాడడం లేదు. మొత్తానికి చైర్‌పర్సన్‌ పీఠానికి బహుముఖ పోటీ నెలకొనడంతో మరోమారు భువనగిరి ము న్సిపల్‌ రాజకీయం ఆసక్తికర చర్చకు తెరలేపింది.  

సాక్షి, యాదాద్రి : భువనగిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎంపిక ఇప్పు డు జిల్లాలో హాట్‌ టాఫిక్‌గా మారింది. జనరల్‌ మహిళకు కేటా యించిన చైర్‌పర్సన్‌ పదవి కోసం అధికార పార్టీకి చెందిన ఐదుగురు మహిళా కౌన్సిలర్లు ప్రధానంగా పోటీపడుతున్నట్లు తెలు స్తోంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా వారు ప్ర యత్నాలు సాగిస్తున్నారని.. ముందుగా, తాజాగా చేసుకున్న ఒ ప్పందాలను తెరమీదికి తెసున్నారు.

పావులు కదుపుతున్న సభ్యులు
మున్సిపాలిటీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చైర్‌పర్సన్‌గా ఉన్న బీజేపీకి చెందిన సుర్వి లావణ్యపై అధికార, ప్రతిపక్ష సభ్యులు అవిశ్వాసానికి తెరలేపారు. జూలై 24వ తేదీన ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఆమె ఓడిపోవడంతో పదవినుంచి వైదొలిగారు. ఆమె స్థానంలో నూతన చైర్‌పర్సన్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. ఇందుకు గాను ఈనెల 31న ముహూర్తం ఖరారు చేశారు. గడువు సమీపిస్తుండడంతో మున్సిపల్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార పార్టీకి చెందిన పలువురు మహిళా కౌన్సిలర్లు తమ ప్రయత్నాలను తీవ్రతరం చేశారు.

టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లలో ఎనిమిది మంది మహిళలు ఉండగా వారిలో ఐదుగురు సభ్యులు తమకంటే తమకే అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని గట్టిగా కోరుతున్నట్లు తెలుస్తోం ది. ఈక్రమంలో ముందుగా చేసుకున్న ఒప్పం దాలు, తాజా ఒప్పందాలు తెరమీదికి వస్తున్నాయి. చైర్‌పర్సన్‌ పదవికోసం అధిష్టానం వద్ద తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న వారిలో ను వ్వుల ప్రసన్న,ఎనబోయిన లలిత, యాట భా రతమ్మ, కడారి ఉమాదేవి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొందరు   కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

నాడు ఒక్కటై.. నేడు విడిపోయి!
చైర్‌పర్సన్‌గా ఉన్న సుర్వి లావణ్యను కుర్చీ లోంచి దించడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. అనంతరం చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల మధ్య ఆమె టీఆర్‌ఎస్‌లోనుంచి బీజేపీ గూటికి చేరడంతో ఒక్క సభ్యుడు మినహా మిగతా వారందరూ ఆమెకు మద్దతుగా నిలిచారు. చైర్‌పర్సన్‌ను దించడానికి ఒకటిగా ఉన్నవారందరూ ప్రస్తు తం విడిపోయారన్న ప్రచారం సాగుతోంది.

పరిస్థితి మారిందా?
ముందుగా నువ్వుల ప్రసన్నకు చైర్‌పర్సన్‌ అవకాశం ఇస్తామని అనుకున్నప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో ఆపరిస్థితి మారిన ట్లు తెలుస్తోంది. చైర్‌పర్సన్‌ పీఠాన్ని దక్కించుకోవాలని ఎవరికి వారే తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలోపడ్డారు.   చైర్‌పర్సన్‌గా ఎంపికవ్వాలంటే 16మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి నిర్ణయమే అంతిమమని ప లువురు కౌన్సిలర్లు అంటున్నారు. అదే జరిగి తే చైర్‌పర్సన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.  

మరిన్ని వార్తలు